Magesh Babu – Manjula Funny Video : సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ప్రస్తుతం రాజమౌళి(Rajamouli) సినిమా కోసం రెడీ అవుతున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ లోపు మహేష్ తన లుక్ ని మార్చే పనిలో పడ్డాడు. జక్కన్న సినిమా కోసం మహేష్ లాంగ్ హెయిర్ మైంటెన్ చేస్తున్నాడు.
ఇక షూటింగ్ కి ఇంకా టైం ఉండటంతో ప్రెజెంట్ తన ఫ్యామిలీతో కలిసి సరదా సమయాన్ని గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్(Hyderabad) లో జరిగిన ఓ పెళ్లికి మహేష్ కూతురు సితారతో కలిసి వెళ్ళాడు. ఈ వేడుకకు మహేష్ సోదరి మంజుల కూడా హాజరవగా.. వీళిద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
మహేష్ ని ఆట పట్టించిన మంజుల
మహేష్ సోదరి మంజుల ఈ వేడుకలో తమ్ముడిని సరదాగా ఆట పట్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా(Social Media) లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో మంజుల మహేష్ జుట్టుని లాగుతూ.. “ఏంట్రా జుట్టు ఇంత పెరిగింది. కొంపతీసి ఇది విగ్గా? అని మహేష్ ని సరదాగా ఆట పట్టించింది. దానికి మహేష్..”ఇది ఒరిజినల్ హెయిర్” అని అక్కకు చెప్పాడు. అలా ఈ ఇద్దరి మధ్య జరిగిన ఫన్ మూమెంట్స్ మహేష్ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
Cutest video on the internet today#MaheshBabu with his sister Manjula pic.twitter.com/ZkwXXp6mZL
— KLAPBOARD (@klapboardpost) April 29, 2024
మహేష్ తో ప్రభాస్ పెద్దమ్మ
మహేష్ బాబు అటెండ్ అయిన ఈ పెళ్ళికి ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి కూడా వచ్చారు.ఇందులో భాగంగానే శ్యామలా దేవి మహేష్ ని పలకరించారు. అనంతరం కూతురు సితారతో కలిసి ఫోటో దిగారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
Also Read : వామ్మో.. ‘కూలీ’ కోసం రజినీకాంత్ రెమ్యునరేషన్ వందల కోట్లా?