Guntur Kaaram : ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా స్టార్ హీరో మహేష్ బాబు(Mahesh Babu) నటించిన గుంటురు కారం(Guntur Kaaram) సినిమా విడుదల అయింది. ఈ క్రమంలో తమ అభిమాన నటుడు మహేష్ బాబు సినిమా కావడంతో ఫ్యాన్స్ సంక్రాంతి(Sankranti) పండుగకు ముందే ఈ సినిమా పండుగ జరుపుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. అమలాపురం(Amalapuram) లో మహేష్ బాబు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దేవుడు రూపంలో మహేష్ బాబు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణుడు(Sri Krishna) రూపంలో మహేష్ బాబు ఫోటో పెట్టి దేవుడికి కొబ్బరికాయలు కొట్టండి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదాస్పదంగా మారాయి. శ్రీకృష్ణుని రూపంలో మహేష్ బాబు ఫ్లెక్సీ పెట్టడంపై పలువురు మండిపడుతున్నారు.
ALSO READ: వైసీపీకి రాజీనామా.. ఎమ్మెల్యే పెండెం దొరబాబు క్లారిటీ
పోలీసులా అయితే..?
కోనసీమ జిల్లాలో సెక్షన్ 30 అమలులో ఉందని ఎలాంటి సభలు సమావేశాలు ర్యాలీలు చేయకూడదని పోలీసులు పోలీసులు హెచ్చరించారు. అమలాపురం ప్రధాన రహదారిపై బస్సులు ఎక్కి మరి హంగామ సృష్టించారు మహేష్ బాబు అభిమానులు. అక్కడి ప్రజలకు ఇబ్బంది కలిగించేలా రోడ్డు మొత్తం బ్లాక్ చేసి సంబరాలు చేపట్టారు. వెళుతున్న బస్సులను ఆపి బస్సు పైకి ఎక్కి చిందులు వేశారు మహేష్ బాబు అభిమానులు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇది గుంటూరు ఘోరం..
టాలీవుడ్(Tollywood) స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) మరోసారి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నారు. మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా ఆయన తెరకెక్కించిన ‘గుంటూరు కారం'(Guntur Kaaram)మూవీ ఈరోజు విడుదలవగా.. థియేటర్ల దగ్గర ప్రిన్స్ అభిమానులు రచ్చ చేస్తున్నారు. అయితే ఈ మూవీ చూసిన ఫ్యాన్స్ హీరో, డైరెక్టర్ ను తెగ పొగిడేస్తుంటే మరికొందరు మాత్రం దారుణంగా విమర్శలు చేస్తున్నారు.
Fans to Guruji: Audience meedha Revenge haa anna#MaheshBabu𓃵#GunturKaraam#Trivikram#TrivikramSrinivas pic.twitter.com/CN1GZL1mPb
— Prem Dadwadia प्रेम डडवाड़िया (@PremDadwadia) January 12, 2024