Acid Attack On Three Girls: అబ్బాయిలు..అమ్మాయిలను వేధించడం ఎప్పటికి ఆగుతుందో తెలియడం లేదు. ప్రేమ పేరుతో వేధించడం…ఒప్పుకోకపోతే యాసిడ్ అటాక్స్ చేయడం. ఇది చాలా సర్వ సాధారణం అయిపోయింది. అమ్మాయిలు ఏదో తమ స్వంత ప్రాపర్టీ అన్నట్టు ప్రవర్తిస్తారు. అసలు ఏ వ్యక్తీ ఎవరికీ సొంతం కారు అన్న విషయాన్నే మర్చిపోతారు. తల్లిదండ్రులు-పిల్లలు, భార్యాభర్తలు ఇలాంటి బంధాల్లో కూడా ఎవరి వ్యక్తిత్వం వారికి ఉంటుంది…ఎవరి ఈవితాలు వాళ్ళకు ఉంటాయి. అలాంటిది ప్రేమించిన అమ్మాయిని తనది ఎలా అనుకుంటారో ఈ అబ్బాయిలు. పైగా తమ ప్రేమించకపోతే…ఇంకెవ్వరికీ దక్కకూడదు అనే స్వార్ధం ఒకటి. ఈ ఆలోచనతో ఎంతటి దారుణాలకు అయినా తెగబడుతున్నారు.
కర్ణాటకలోని మంగుళూరులో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. కర్ణాటకలోని కడబా తాలూకాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతన్న ముగ్గురు అమ్మాయిల మీద యాసిడ్ దాడి చేశాడో యువకుడు. పరీక్షలు రాయడానికి వచ్చి కాలేజీలో కూర్చుని చదువుకుంటున్న అమ్మాయిల మీద దాడికి తెగబడ్డాడు. దాడి చేసిన కుర్రాడు కేరళకు చెందిన అబీన్గా గుర్తించారు. ఇతను మాస్క్, టోపీ ధరించి వచ్చి అమ్మాయిల మీద అటాక్ చేశాడు.
అటాక్ జరిగినవెంటనే కాలేజీలో ఉన్న మిగతా స్టూడెంట్స్ అబీన్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ అమ్మాయిలను ఆసుపత్రిలో జాయిన్ చేశారు. వారు అక్కడ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. అయితే అబీన్ ఎందుకు అటాక్ చేశాడు. ముగ్గురు అమ్మాయిల్లో ఎవరి కోసం ఇదంతా చేవాడు అన్న విషయాలు ఇంకా తెలియలేదు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also Read:National: స్పానిష్ మహిళపై సామూహిక అత్యాచారం.. సోషల్ మీడియాలో భర్త ఆవేదన!