High Speed Train:చైనా మళ్ళీ కొత్తది కనిపెట్టేసింది. కొత్త ఆవిష్కరణలకు, అద్భుతాలకు పెట్టింది పేరైన చైనా తాజాగా సరికొత్త ఇన్వెన్షన్‌ను తీసుకొచ్చింది. ప్రపంచంలోనే అత్యంత స్పీడ్ రైలును తీసుకొచ్చేసింది. గంటకు 623 కిలోమీటర్లకుపైగా వేగంతో ప్రయాణించే మోగ్లెవ్ రైలును విజయవంతంగా పరీక్షించింది. దీనికి మోగ్లేవ్ ట్రైవ్ అని పేరు పెట్టింది. ఇది రెండు గంటల్లో ఈజీగా 1250 కి.మీ కవర్ చేసేయగలదు అని చెబుతోంది చైనా. దీంతో అంతకు ముందు తన పేరు మీద ఉన్న రికార్డును తనే బద్దలు కొట్టుకుంది చైనా.
Also Read:🔴Kaleswaram Project CAG Report: కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రభుత్వం కాగ్ నివేదిక
ఇంతకు ముందు 387…ఇప్పుడు 623కి.మీ
ప్రపంచంలో అత్యంత ఫాస్టెస్ట్ ట్రైన్ రికార్డ్ చైనా పేరు మీదనే ఉంది. రెండేళ్ళ కిందట 387 కి.మీ వేగంతో ప్రయాణించే మోగ్లేవ్ ట్రైన్‌ను కనిపెట్టింది. ఇప్పుడు దాన్ని అధిగమిస్తూ గంటకు 623 కి.మీ స్పీడ్‌తో నడిచే మరో ట్రైన్‌ను పరీక్షించారు. ఇది విజయవంతం అయిందని చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ( CASIC) ప్రకటన చేసింది. ఈ అయస్కాంత లెవిటేటెడ్ ట్రైన్ రైలు కేవలం 2 కి.మీ పొడవు మాత్రమే ఉంటుంది. ఇది తక్కువ పీడనం కలిగిన ట్యూబ్లలో ప్రయాణిస్తుంది. ప్రస్తుతం పరీక్సించిన మోగ్లేవ్ ట్రైన్ విమానంతో సమానంగా నడుస్తుంది.
విద్యుతయస్కాంతంతో నడుస్తుంది…
మోగ్లేవ్ అంటే పూర్తిగా విద్యుత్ అయస్కాంతం నడిచేది అని అర్ధం. ఈట్రైన్ అయస్కాంత శక్తితో నడుస్తూ ట్రాక్‌ల మీద ఘర్షణనను తగ్గిస్తుంది. దాంతో పాటూ మరింత వేగంగా ప్రయాణించడానికి త్యేకంగా రూపొందించిన గాలి నిరోధకతను తగ్గించే తక్కువ వాక్యూమ్ ట్యూబ్ సహకరిస్తుంది. ఇప్పుడు ఈ ట్రైన్ మీద చేసిన పరీక్షలు విజయవంతం అవడంతో చైనా ఏరోస్పేస్, టెరెస్ట్రియల్ రైల్ ట్రాన్స్పోర్ట్ టెక్నాలజీలను అనుసంధానం చేసే హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ విమాన వేగాన్ని అధిగమించేలా గంటకు 1,000 కి.మీ వేగంతో నడిచే రైలును రూపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.