Madhya Pradesh Tragedy : మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని ఏకంగా 25 కిలోమీటర్ల వరకు రోడ్డుపై ఈడ్చుకెళ్లడం కలకలం రేపింది. తీవ్ర గాయాలపాలైన అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. సెహోర్ జిల్లాలో ఆదివారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ‘ భూపాల్‌లోని అవాద్‌పురి ప్రాంతంలో సందీప్ నక్వాల్(33), సంజీవ్ నక్వాల్(53), రాజేష్ చదార్‌లు(38) ఉంటున్నారు. అయితే ఇటీవల వారు దహన సంస్కరణల కోసమని రాజస్థాన్‌కు వెళ్లారు. ఆ కార్యక్రమం ముగిశాక తిరిగివస్తూ మార్గమధ్యంలో సెహోర్ జిల్లాలో ఆగి భోజనం చేశారు. అలాగే మద్యం కూడా సేవించారు. ఆ తర్వాత కారులో తమ ప్రయాణం కొనసాగించారు. అయితే సందీప్, సంజీవ్‌లు ఇద్దరు బంధువులే. వీళ్లు వెనక సీట్లో కూర్చోగా.. రాజేష్ కారు డ్రైవింగ్ చేస్తున్నాడు.
Also Read: ఏడాది తర్వాత అధికారం మాదే.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
అలా వెళ్తుండగా.. ఓ విషయంలో సందీప్, సంజీవ్‌ల మధ్య గొడవ జరిగింది. దీంతో కోపంతో సంజీవ్.. సందీప్‌ను మార్గమధ్యంలోనే కారు నుంచి బయటకు తోసేశాడు. కానీ సందీప్‌కు సీటు బెల్టు ఉండటంతో అతను రోడ్డుపై పడిపోలేదు. రోడ్డుకు, కారు డోరుకు మధ్య ఇరుక్కున్నాడు. సందీప్ శరీరం అలా రోడ్డుపైనే గీసుకుపోతోంది. మద్యం మత్తులో ఉన్న సంజీవ్, రాజేష్‌లు ఈ విషయాన్ని గమనించలేదు. అల సందీప్‌ను కారు ఈడ్చుకెళ్లూనే ఉంది. సందీప్ అరిచినా కూడా గాలి, ఇంజిన్ శబ్ధానికి అతని కేకలు వినపడలేదు. చివరికి ఓ వ్యక్తి ఇది గమనించి పోలీసులకు ఫోన్ చేశాడు. సమాచారం మేరకు అక్కడికి వచ్చిన పోలీసులు ఆ కారును వెంబడించారు. చివరికి ఓ టోల్ గేట్ వద్దకు రాగానే దాన్ని అడ్డుకున్నారు. అయితే అప్పటికే సందీప్ శరీరం ఛిద్రమైపోవడంతో అతడు మరణించాడు. ఇలా దాదాపు 25 కిలోమీటర్ల వరకు సందీప్‌ను కారు ఈడ్చుకెళ్లిందని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
Also read: తెలంగాణకు ఐటీ మంత్రి ఆయనే.. కేటీఆర్ కంటే డైనమిక్ అంటున్న నెటిజన్లు