Raj Tarun Parents: నిన్న రాత్రి తమపై దాడికి ప్రయత్నించిందంటూ రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్య మీద ఫిర్యాదు చేశారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో రాజ్ తరుణ్ తల్లి బసవరాజు రాజ్యలక్ష్మి ఈ ఫిర్యాదును చేశారు.తమ ఇద్దరికీ కూడా హెల్త్ సమస్యలు ఉన్నాయని…లావణయ వల్ల తమకు ప్రాణహాని ఉందని వారు కంప్లైంట్లో రాశారు. రాజ్ తరుణ్ తల్లిదండ్రుల తరుఫున వారి లాయర్ ఇంద్ర గంటి మధు శర్మ తరుణ్ అడ్వకేట్ కూడ వచ్చారు. రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు హైబీపీ ఉందని..వారికి రక్షణ కల్పించాలని అడ్వకేట్ పోలీసులను కోరారు.
లావణ్యకు వ్యతిరేకంగా అన్ని ఆధారాలు రాజ్ తరుణ్ వద్ద ఉన్నాయి అని అడ్వకేట్ మధుశర్మ తెలిపారు. ఆ విషయం గురించి తాము కోర్టులో చూసుకుంటామని అన్నారు. ప్రతిచోట లేడీస్ విక్టిమ్ కార్డ్ పనిచేయదని చెప్పారు. కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని మాదాపూర్ సీఐ కృష్ణమోహన్ తెలిపారు.
Also Read:USA: నా ప్రాణాలు కాపాడావు ..మహిళకు ట్రంప్ కృతజ్ఞతలు