Samantha New Movie Poster Released : టాలీవుడ్(Tollywood) స్టార్ హీరోయిన్ సమంత(Samantha) నేడు (ఆదివారం) తన పుట్టిన రోజు(Birthday) జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సెలెబ్రిటీలు, అభిమానులు ఆమెకి బర్త్ డే విషెస్ చెబుతుంటే.. సమంత మాత్రం మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు గుడ్ న్యూస్ చెప్పింది. అంతేకాదు తన కొత్త సినిమాకి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చింది. ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
సమంత కొత్త సినిమా టైటిల్ ఇదే
విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ తర్వాత సినిమాలకి కొద్ది నెలల పాటూ గ్యాప్ ఇచ్చిన సామ్.. ఎట్టకేలకు తన కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసింది. ఈ మేరకు కొత్త సినిమా పోస్టర్ ని సోషల్ మీడియా(Social Media) లో షేర్ చేసింది. ‘మా ఇంటి బంగారం’ అనే టైటిల్ తో ఉన్న ఈ పోస్టర్ లో సమంత చీరకట్టులో భుజానికి బ్యాగ్, చేతిలో గన్ పట్టుకొని ముఖంపై రక్తపు మరకలతో కనిపిస్తోంది. ఇందులో సమంత లుక్ చాలా ఇంటెన్స్ గా ఉంది.
చూస్తుంటే ఇది లేడీ ఓరియంటెడ్ సినిమా(Women Oriented Movie) లాగా అనిపిస్తోంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ సినిమాని సమంత తన సొంత ప్రొడక్షన్ హౌజ్ త్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తోంది. కాగా ఈ సినిమాలో సమంత కొత్తగా పెళ్ళైన యువతీ ‘బంగారం’ అనే పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం సమంత కొత్త సినిమా పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాకి దర్శకుడు ఎవరనే విషయాన్ని వెల్లడించలేదు కానీ త్వరలోనే సినిమా స్టార్ట్ కానుందని తెలిపారు.
View this post on Instagram
Also Read : కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ‘జబర్దస్త్’ కమెడియన్.. ఇల్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే?