Ceiling Fan: వేసవి కాలంతో పాటు వర్షాకాలంలోనూ ఇంట్లో ఫ్యాన్ ఉపయోగం చాలా ఉంటుంది. వర్షాకాలంలో ఫ్యాన్ లేకపోతే శరీరం పై దోమలు తాండవం చేస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఇంట్లోని ఫ్యాన్ నెమ్మదిగా తిరగడం వల్ల అసౌకర్యం, ఇబ్బంది తలెత్తుతాయి. అటువంటి పరిస్థితిలో, వెంటనే కొత్త ఫ్యాన్‌ని మార్చే బదులు.. కొన్ని చిన్న చిట్కాలతో ఫ్యాన్‌ను వేగంగా తిరిగేలా చేయవచ్చు అవేంటో తెలుసుకుందాము..
ఫ్యాన్ వేగం తగ్గడానికి కారణాలు
తక్కువ వోల్టేజ్
ఫ్యాన్ చాలా నెమ్మదిగా తిరగడానికి ప్రధాన కారణం.. తక్కువ వోల్టేజ్. విద్యుత్తు వినియోగం బాగా పెరిగినప్పుడు.. వోల్టేజీ తక్కువై ఫ్యాన్ వేగం స్లో అవుతుంది. ఇది కాకుండా, రెండవ ప్రధాన కారణం ఫ్యాన్ కండెన్సర్ వైఫల్యం. వోల్టేజ్ బాగా ఉన్న తర్వాత కూడా ఫ్యాన్ స్లో స్పీడ్‌తో తిరిగితే.. దానికి కారణం కండెన్సర్ నాణ్యత తగ్గడం.
కండెన్సర్‌ను మార్చడం
ఫ్యాన్ వేగంగా తిరగడంలో కండెన్సర్ ప్రధానగా పనిచేస్తుంది. ఒకవేళ ఫ్యాన్ చాలా నెమ్మదిగా నడుస్తుంటే.. అప్పుడు కండెన్సర్‌ను మార్చండి. ఇంటి మెయిన్ స్విచ్‌ను ఆఫ్ చేసి, పాత కండెన్సర్‌ను తీసివేసిన విధంగానే కొత్త దాన్ని అమర్చండి. మీ ఫ్యాన్ వేగం మునుపటి కంటే వేగంగా ఉంటుంది.
స్టెబిలైజర్
లోవోల్టేజీ అనేది చాలా సాధారణ సమస్య. ఇంట్లో డిమ్ లైట్ సమస్య ఉంటే, ఖచ్చితంగా స్టెబిలైజర్‌ను కొనుగోలు చేయాలి. దీన్ని ఇంటి ప్రధాన సరఫరాకు కనెక్ట్ చేయాలి. తక్కువ వోల్టేజ్ సమస్య స్టెబిలైజర్ ద్వారా పరిష్కరించబడుతుంది. దీని కారణంగా ఫ్యాన్ వేగంగా నడుస్తుంది.
ఫ్యాన్ శుభ్రత
ఫ్యాన్ బ్లేడ్లపై దుమ్ము చేరడం వల్ల, దాని వేగం గణనీయంగా తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో, ఫ్యాన్ శుభ్రత గురించి పూర్తి శ్రద్ధ వహించాలి. ముందుగా ఇంటి మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి, ఆపై తడి, పొడి గుడ్డ సహాయంతో ఫ్యాన్ బ్లేడ్ లను పూర్తిగా శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ ఫ్యాన్ స్పీడ్ నార్మల్ అవుతుంది.
Also Read: Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్- మెహరీన్ పెళ్లి పై క్లారిటీ.. షాకిచ్చిన తేజ్ టీమ్..! – Rtvlive.com