ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికల్లో 25 స్థానాల్లో 24-25 సీట్లను వైసీపీనే దక్కించుకుంటుందని వెల్లడైంది టౌమ్స్ నౌ ఈటీజీ ఒపినీయన్ పోల్ లో. టీడీపీ ఎక్కువలో ఎక్కువ ఒకస్థానం దక్కించుకుంటుందని చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఇంతకు ముందు కన్నా బలపడింది అంటోంది ఒపీనియన్ పోల్. ఆ పార్టీకి వ్యతిరేకత ఉందని వార్తలు వినిపిస్తున్నా ఎన్నికల్లో మాత్రం అదే గెలుస్తుందని చెబుతోంది. గత ఐదేళ్ళల్లో ఆంధ్రలో ప్రవేశపెట్టిన పథకాలే ప్రజల చేత ఓటు వేయించేలా చేస్తాయని అంటోంది. అయితే పోల్, సర్వే ఫలితాలు కేవలం అంచనా మాత్రమే. ఇవి ఎప్పుడైనా తారు మారు కావొచ్చు. పార్టీ అభ్యర్ధులను ప్రకటించాక…అప్పుడు పరిస్థితులను బట్టి ఫలితాలు ఆధారపడి ఉంటాయి.
మరోవైపు టీడీపీ మాత్రం ఫలితాల మీద ధీమాగా ఉంది. వైసీపీ వ్యతిరేకతే తమను గెలపిస్తుందని చెబుతున్నారు. ఎన్నికలకు సిద్ధం అన్ని రకాలుగా సిద్ధం అవుతున్నారు. అభ్యర్ధుల ఎంపిక మీద దృష్టి పెట్టారు.
TIMES NOW- @ETG_Research Survey
Who will win how many seats in Andhra Pradesh?
Total Seats- 25
– YSRCP: 24-25
– TDP: 0-1
– JSP: 0
– NDA: 0Watch @TheNewshour as @NavikaKumar also takes us through seat share projections from K’taka, Tamil Nadu, Assam & Telangana. pic.twitter.com/O8FcOFcojh
— TIMES NOW (@TimesNow) December 13, 2023
Also Read:హ్యాట్రిక్ కొట్టడం గ్యారెంటీ…టైమ్స్ నౌ ఈటీజీ ఒపీనియన్ పోల్