Central Home Minister Amith Sha: ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మక్షం మంత్రి…బీజేపీలో ముఖ్యనాయకుడు ఇలా అమిత్ షా ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితంలో పోషించిన పాత్రలు ఎన్నో. తన పేరు మీద, తన భార్య పేరు మీద కూడా కోట్ల విలువైన ఆస్తులున్నాయి. కానీ పాపం సొంతకారు మాత్రం లేదని చెబుతున్నారు అమిత్ షా. నిన్న ఆయన గాంధీనగర్ లోక్‌సభ స్థానానికి గానూ నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో తన మొత్తం ఆస్తి వివరాలను పొందుపరిచారు. అమిత్ షా మొత్తం ఆస్తి 36 కోట్లు.
ఆస్తులు..ఆప్పులు..
కేంద్రమంత్రి అమిత్ షా నామినేషన్లో పొందుపరిచిన వివరాల ప్రకారం ఆయనకు 20 కోట్ల చర, రూ.16 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. అది కాక తన భార్య సోనాల్‌కు రూ.31 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. వీటితో పాటూ 72 లక్షల విలువైన ఆభరణాలు, ఆయన సతీమణికి రూ.1.10 కోట్ల విలువైన నగలున్నాయని వెల్లడించారు. ఇక అప్పుల విషయానికి వస్తే అమిత్ షా పేరు మీద రూ.15.77లక్షలు.. సోనాల్ పేరు మీద రూ. 26.32లక్షల అప్పు ఉందని ఆఫడవిట్‌లో రాశారు.
వృత్తి రిత్యా రైతు..
2022-23 ఏడాదికిగానూ ఎంపీగా అమిత్ షా మొత్తం 75.09 లక్షల జీతాన్ని అందుకున్నారు. అలాగే ఆయన భార్య సోనాల్ ఈ ఏడాది మొత్తంలో 39.54 లక్షల ఆదాయాన్ని సంపాదించారు. దీంతో పాటూ స్థలం, ఇంటి అద్దెలు, వ్యవసాయం, షేర్లు, డివెండ్ వాటి వల్ల కూడా తనకు ఆదాయం వస్తుందని అమిత్ షా తెలిపారు. వృత్తా రిత్యా తాను రైతులనని చెప్పారు అమిత్ షా. తన మీద మూడు క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయని వెల్లడించారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లోకూడా అమిత్ షా గాంధీనగర్ నుంచో పోటీ చేశారు. అప్పుడు ఆయన దాదాపు 5.57 లక్షల మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు కూడా అమిత్ షా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా…ఈయనకు పోటీగా కాంగ్రెస్ తమ పార్టీ మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు సోనాల్ పటేల్‌ను రంగంలోకి దించింది. ఈ స్థానానికి మూడో విడతలో భాగంగా మే 7వ తేదీన పోలింగ్ జరగనుంది.
Also Read:Elon Musk : ఇప్పుడు రావడం లేదు.. భారత్‌లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా