Cyberabad Traffic Police : రోడ్డు ప్రమాదాలు(Road Accidents) ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరుగుతాయో ఎవరూ చెప్పలేరు. నిర్లక్ష్యం, అతివేగం(Over Speed), నిద్రమత్తు వంటి కారణాలే ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతాయన్నది అందరికీ తెలిసిన విషయం. అనుకోకుండా జరిగే ప్రమాదాలలో కొంతమంది గాయాలతో బయటపడుతారు. మరి కొంత మంది అక్కడికక్కడే మృతి చెందుతారు. కానీ, ఒక్కోసారి మనం ధరించే దుస్తులు కూడా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతాయి. అదేంటి, దుస్తులు ఎలా రోడ్డు ప్రమాదాలకు దారి తీస్తాయని అనుకుంటున్నారా? అయితే, ఒకసారి సైబరాబాద్ ట్రాఫిక్ అధికారులు చేసిన ఈ వీడియో చూడండి.
మీరు ధరించే దుస్తులు కూడా రోడ్డు ప్రమాదాలకు ఒక్కోసారి కారణమవుతాయి తెలుసా?#RoadSafety pic.twitter.com/5X6o6aO9KI
— CYBERABAD TRAFFIC POLICE (@CYBTRAFFIC) March 8, 2024
అందులో ఓ వ్యక్తి బ్లాక్ కలర్ టీ షర్ట్(Black Color T-Shirt) ధరించి రోడ్డు దాటుతున్నాడు. అతడు ధరించిన టీ షర్ట్ కారణంగా ఎదురుగా వస్తున్న వాహన డ్రైవర్‌కు దగ్గరకు వచ్చే వరకు అతడు కనిపించలేదు. క్షణకాలంలోనే అతడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అయితే, ప్రమాదం ఎప్పుడు జరుగుతుందో తెలియదు కాబట్టి ముందుగానే మనం దుస్తులు ధరించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి సమయం(Night Time) లో రోడ్డుపై నడిచే వారు, బైక్ పై వెళ్లే వారు లైట్ కలర్ డ్రెస్(Light Color Dress) లు వేసుకోవాలి. ఎల్లో, వైట్, గ్రీన్ కలర్స్ దుస్తులు వేసుకుంటే మంచిదని ట్రాఫిక్ అధికారులు అంటున్నారు. లేదా రిఫ్లెక్టవ్ దుస్తులు ధరించాలని చెబుతున్నారు. నైట్ టైమ్స్ బయటికి వేళ్లే వారు బ్లాక్ , బ్లూ, రెడ్ డ్రెస్ లు వేసుకోకపోవడమే మంచిందని సూచిస్తున్నారు. ఇలా రోడ్డు ప్రమాదాల బారి నుండి తప్పించుకోవచ్చని తెలియజేస్తున్నారు.