Lokesh Kanagaraj About Leo Part- 2 : తలపతి విజయ్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో గత ఏడాది వచ్చిన ‘లియో’ మూవీ (Leo Movie) కోలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజై వరల్డ్ వైడ్ గా 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. విజయ్ సరసన త్రిష (Trisha) హీరోయిన్ గ నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్, అర్జున్ సర్జా, ప్రియా ఆనంద్, మడోనా సెబాస్టియన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. కాగా ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉందని లోకేష్ తాజాగా వెల్లడించాడు. దీంతో ఫ్యాన్స్ లో సీక్వెల్ పై ఆసక్తి నెలకొంది.
కథ రెడీ..
విజయ్ (Vijay Thalapathy) పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాలకు బ్రేక్ ఇస్తారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న’ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ చిత్రంలో నటిస్తున్న విజయ్.. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత కార్తీక్ సుబ్బరాజుతో తన 69వ ప్రాజెక్ట్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. రాజకీయాల బిజీగా ఉండటం వల్ల విజయ్‌కి చివరి సినిమా అనే టాక్ సైతం కోలీవుడ్ మీడియాలో వినిపించింది.
Also Read : ‘కల్కి’ కథ రాయడానికి అన్నేళ్లు పట్టిందా? షాకింగ్ విషయాలు రివీల్ చేసిన నాగ్ అశ్విన్!
సరిగ్గా ఇలాంటి సమయంలో లోకేష్ కనగరాజ్ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ లియో-2 చిత్రం కథ రెడీ అని, విజయ్ ఓకే అంటే వెంటనే ప్రారంభమవుతుందని పేర్కొనడం చర్చినీయాంశంగా మారింది. ప్రస్తుతం రజనీకాంత్‌తో లోకేష్ కనకరాజ్ ‘కూలీ’ సినిమా తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. జూలై నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతోంది.