Senior Actress Laya Interview : తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పటి హీరోయిన్స్ అంతా ఇప్పుడు సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ లో ఆకట్టుకుంటున్నారు. ఈ లిస్ట్ లో అప్పటి తెలుగు హీరోయిన్ లయ కూడా చేరిపోయింది. త్వరలోనే లయ నితిన్ (Nithiin) ‘తమ్ముడు’ సినిమాతో వెండి తెరపై కనిపించబోతుంది.
అయితే తాజాగా అలీతో సరదాగా షోలో పాల్గొన్న లయ తన సినీ కెరీర్ కి సంబంధించి ఎన్నో విషయాలు పంచుకుంది. ఈ క్రమంలోనే అప్పట్లో ఓ డైరెక్టర్ తనను చంపుతానని బెదిరించినట్లు షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది.
నా గురించి అలా రాయడం ఎంతో బాధేసింది
లయ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. అవి విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అని అలీ అడిగితే.. “ఆ వార్తలను నేనూ చూసాను. మనం రోజు కనిపిస్తూ ఉంటే మన గురించి వార్తలు వచ్చినా ఎవరూ నమ్మరు.
సోషల్ మీడియాకు నేను దూరంగా ఉండటంతో నా గురించి రకరకాల వార్తలు రాశారు. నా ఆర్థిక స్థితి బాలేదని, నేను తీ అమ్ముకొని తుకుతున్నట్లు చాలా దారుణంగా రాశారు. అది చూసి నా ఫ్యామిలీ ఎంతో బాధ పడింది. నాపై అలా రాయడం చూసి నేనూ ఎంతో బాధపడ్డాను” అని చెప్పింది.
ఆ డైరెక్టర్ చంపుతానని బెదిరించాడు
ఓ డైరెక్టర్ మిమ్మల్ని చంపుతానని బెదిరించాడట, ఎందుకు అని అలీ అడగ్గా.. ” అవును అది నిజమే.. ఓ సినిమా డేట్స్ సర్దుబాటు విషయంలో గొడవ జరిగింది. దీంతో ఆ డైరెక్టర్ నన్ను చంపేస్తానని బెదిరించాడు. మీరు చంపేసినా నేనేం చేయలేనని అతనికి చెప్పాను” అంటూ చెప్పుకొచ్చింది.