Ayodhya To Delhi Indigo Flight : ఏప్రిల్ 13న అయోధ్య(Ayodhya) నుంచి ఢిల్లీ(Delhi) కి ఇండిగో విమానం(Indigo Flight) బయలుదేరింది. చివర వరకు బాగానే వచ్చేసింది. కానీ ల్యాండింగ్ టైమ్‌కు డిల్లీలో వాతావరణం బాగాలేదు. రెండు సార్లు ప్రయత్నించినప్పటికీ పైలట్లు విమానాన్ని ల్యాండ్ చేయలేకపోయారు. దాంతో దాదాపు రెండు గంటలపాటూ గాల్లోనే చక్కర్లు కొట్టారు. అయితే ఈలోపు విమానంలో ఇంధనం అయిపోయింది. ఇంకొక్క రెండు నిమిషాలు మాత్రమే ఫ్లైట్ ఎగురగలదు అన్న పరిస్థితికి వచ్చేసింది. కానీ తీరా చూస్తే ఢిల్లీలా వాతావరణం అప్పటికీ ఇంకా వరస్ట్గానే ఉంది. ల్యాండింగ్ చేయడానికి అనుమతి అభించలేదు.
చివర నిమిషంలో ఫ్లైట్ మళ్ళింపు…
ఇలాంటి పరిస్థితుల్లో పైలట్లు విమానం దారి మళ్ళించారు. ఢిల్లీకి దగ్గరగా ఉన్న చంఢీఘడ్ ఎయిర్‌కు విమానాన్ని తీసుకెళ్ళి ల్యాండింగ్ చేశారు. ల్యాండ్ అయ్యే సమయానికి ఫ్యూయల్ చివరి బొట్టు దగ్గకు వచ్చేసింది. ఏమాత్రం అఆలస్యం అయినా విమానం నిట్టనిలువునా కూలిపోవల్సిందే. అందులో ఉన్నవారి ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. చంఢీఘడ్‌లో విమానం ల్యాండ్ అయ్యాక దానికి కావాల్సిన ఫ్యూయల్ ఎక్కించి, ఢిల్లీలో వాతావరణం బాగయ్యాక… ఫైట్‌ను అక్కడకు తరలించారు పైలట్లు.
జరిగిందిలా…
ఇండిగో విమానం 6E 2702 అయోధ్యలోని మర్యాద పురుషోత్తమరామ విమానాశ్రయం నుంచి ఏప్రిల్ 13న మధ్యాహ్నం 3.25 గంటలకు బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఢిల్లీకి చేరాలి. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా ల్యాండింగ్‌కు వీలుపడ లేదు. దాంతో అక్కడే చాలాసేపు తిరిగింది. మరో 45 నిమిషాల వరకు సరిపడా ఇంధనం మిగిలి ఉందని సరిగ్గా 4.15 గంటలకు పైలెట్ ప్రకటించారు. ఆ టైమ్‌లో పైలట్ రెండుసార్లు ల్యాండింగ్‌కు ప్రయత్నించినా అవ్వలేదు. చివరకు సాయంత్రం 5.30 గంటలకు విమానం చండీగఢ్‌కు మళ్ళించారు. ఢిల్లీ నుంచి ఛంఢీఘడ్ చేరడానికి 115 నిమిషాలు పట్టి… చివరకు 6.10గంటలకు విమానం ల్యాండ్ అయింది. ఈమొత్తం వ్యవహారం గురించి సతీశ్‌కుమార్ అనే ప్రయాణికుడు సోసల్ మీడియా(Social Media) లో పోస్ట్ చేశారు. దీన్ని ఇండిగో, డీజీసీఏ(DGCA) లకు ట్యాగ్ చేశారు. దీని మీద డీజీసీఏ విచారణ చేపడతామని పేర్కొంది. సాధారణంగా వాతావరణం బాగా లేకపోయినా ఫ్లైట్ ఎక్కువసేపు ప్రయాణింగలిగేలా ఫ్యూయెల్ నిపుతారు. విమానం బయటలుదేరకముందే ఇవన్నీ చెక్ చేసుకుంటారు. కానీ ఇండిగో విమానంలో అలా జరగలేదు. దానికి కారనం ఏంటో కనుక్కుని చర్యలు తీసుకుంటామని ఇండిగో, డీజీసీఏ రెండూ చెబుతున్నాయి.