Sonu Sood Met Kumari Aunty: ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరలైన పేరు కుమారీ ఆంటీ. హైదరాబాద్ లో ఒక చిన్న స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ రన్ చేస్తున్న ఈమె సోషల్ మీడియా పుణ్యమాని సెలెబ్రెటీలా మారిపోయింది. స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ తో ఫుల్ పాపులరైన కుమారీ బుల్లితెర పై కూడా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం పలు సీరియల్స్, టీవీ షోస్ కనిపిస్తూ సందడి చేస్తోంది.
కుమారి ఆంటీని అభినందించిన సోనూసుద్
ఇది ఇలా ఉంటే తాజాగా ప్రముఖ నటుడు సోనూసుద్ కూడా కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ ను స్వయంగా సందర్శించి ఆమెను అభినందించారు. సోనూసుద్ మాట్లాడుతూ.. “కుమారీ ఆంటీ గురించి చాలా విన్నాను. ఆమె ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. నిజమైన మహిళా సాధికారతకు కుమారీ ఆంటీ నిదర్శనంగా నిలిచారు. కుటుంబ పోషణ కోసం ఎంతో మంది మహిళల కష్టాన్ని తెలపడానికి కుమారి ఆంటీ జీవితము ఉదాహరణ. కుటుంబాల్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కునే వారు కుమారీ ఆంటీని చూసి సూర్తి పొందుతారు. కష్టమైన సరే సరైన మార్గంతో ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని కుమారి ఆంటీ నిరూపించింది అంటూ ఆమెను అభినందించారు”. ఆ తర్వాత కుమారి ఆంటీని శాలువాతో సన్మానించారు నటుడు సోనూసుద్. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Also Read: విద్యుత్ బిల్లుల చెల్లింపులో క్యూ ఆర్ కోడ్ విధానం!