కడిగిన ముత్యంలా బయటకొస్తారు
ప్రకాశం జిల్లా కొండపిలో చంద్రబాబు అరెస్ట్‌కి నిరసనగా స్థానిక ఎమ్మెల్యే డోలా బాలవిరంజనేయస్వామి ఆధ్వర్యంలో కొవ్వత్తుల ర్యాలీ చేయాలని పిలునిచ్చారు. అయితే పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఉన్నారని విషయం తెలుసుకున్న పోలీసులు అక్కకు చేసుకున్నారు. పార్టీ కార్యాలయం దగ్గర నుంచి ర్యాలీతో బయలుదేరగా పోలీసులు వాహనాలు రోడ్డుకి అడ్డుపెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే స్వామి తాము ప్రశాంతంగా నిరసన ర్యాలీ చేపడతామని చెప్పినప్పటికీ పోలీసులు వినకపోవడంతో ఎమ్మెల్యేకి పోలీసులకు వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది. ఎట్టికేలకు ర్యాలీ పోలీసు వలయాన్ని దాటుకొని ఎన్టీఆర్ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే స్వామి ఎన్టీఆర్ బొమ్మ సెంటర్లో ప్రసంగించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రేమచంద్రారెడ్డి, అజయకల్లాంరెడ్డి హాయంలో మాప్రభుత్వంలో విరు అధికారులుగా వ్యవహరించారు. ప్రస్తుతం వీరు మీదగ్గర సలహా దారులుగా వున్నారు. మరి వీరిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే స్వామి మండిపడ్డారు. ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించాలని ఆయన పోలీసులకు విజ్ఞప్తి చేశారు. మా అధినాయకుడు చంద్రబాబు ఈ కేసును కడిగిన ముత్యంలా బయటకొస్తాడన్నారని ఆయన దీమ వ్యక్తం చేశారు.
కొవ్వొత్తుల ర్యాలీతో
బాపట్ల జిల్లా అద్దంలో కూడా చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో నాలుగో రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షలు సంఘీభావంగా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ దీక్ష శిబిరానికి చేరుకొని దీక్షలు విరమించే వారికి నిమ్మరసం అందజేశారు. అనంతరం కొవ్వొత్తుల ర్యాలీతో సంఘీభావ యాత్ర చేపట్టారు. పోలీసులు కొవ్వొత్తులు ర్యాలీని అడ్డుకొనడంతో కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు ఎమ్మెల్యేని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలింపుకు ప్రయత్నించగా కార్యకర్తలు పోలీస్ జీప్‌కు అడ్డంగా కూర్చొని ఎమ్మెల్యే విడుదల చేయాలంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు టీడీపీ కార్యకర్తలను బలవంతంగా పక్కకు తరలించి ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి కొరిసపాడు పోలీస్ స్టేషన్ తరలించారు.
అక్రమ కేసులు బనాయిస్తున్నారు
సమాచారం అందుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ తరలివచ్చి ఎమ్మెల్యేకు మద్దతు తెలియజేశారు. ఎమ్మెల్యే రవికుమార్ సొంత పూచికత్తు మీద విడుదల చేశారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ చంద్రబాబుని అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేసినందుకు నిరసనగా ఈరోజు తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నాం అన్నారు. వారిపై జగన్ ప్రభుత్వం ప్రజా ఆదరణ చూడలేక ప్రజలు చేసే ఉద్యమాలు అరికట్టాలని పోలీసులు పావులు వాడుకొని అరెస్టు చేసి స్టేషన్లో పెట్టడం జరుగుతుందన్నారు. ప్రజలను భయభ్రాంతులను చేసి అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఇలాంటి ఎన్ని కేసులు పెట్టినా.. సరే చంద్రబాబు విడుదల అయ్యేంతవరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు రోడ్లపై కొచ్చి సైనికుల్లాగా పని చేయాలని పిలుపునిచ్చారు.