తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి సీఎం పదవి చుట్టూ చర్చ మొదలైంది. సీఎం అయ్యే అర్హత తనతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఉందంటూ నిన్న రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీతో పాటు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశమయ్యాయి. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ఇలాంటి కామెంట్సే చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సీఎం అయ్యే అర్హత ఉందంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానన్నారు. వెంకట్ రెడ్డికి బంగారు భవిష్యత్ ఉందన్నారు. ఈ రోజు నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
Komatireddy venkatareddy
Salar political heat : తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్న డార్లింగ్ ప్రభాస్
Salar friendship song : సలార్ మూవీ ఇంపాక్ట్ పొలిటికల్ వర్గాల్లో మాములుగా లేదు. ఓ వైపు బాక్స్ ఆఫీస్ ఊచకోతతో ఫ్యాన్స్ లో పూనకాలు వచ్చేస్తుంటే , మరో వైపు రాజకీయ నాయకులు సలార్ మూవీలో సాంగ్‌తో వీడియో చేస్తూ ఫ్యాన్స్ ను మరింత ఖుషీ చేసేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి కూడా సలార్ సినిమాలోని సూరీడే గొడుగు పట్టి సాంగ్‌కు ఫిదా అయ్యారు.ఆ పాటకు పొలిటికల్ వీడియో క్లిప్పింగ్స్ యాడ్ చేయడంతో ఇప్పుడు ఆ పాట మరింత వైరల్ గా మారింది.
కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దాం…#KomatiReddyVenkatReddy #BhattiVikramarkaMallu #TelanganaPrajaPrabhutwam@Bhatti_Mallu @INCTelangana pic.twitter.com/suzRsjMIrA
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) December 30, 2023
సలార్ పొలిటికల్ హీట్
తెలంగాణ రాజకీయాలపై డార్లింగ్ ప్రభాస్ గట్టిగానే ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. మొన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూరీడే గొడుగు పట్టి సాంగ్‌కు ఫిదా అయ్యారు. సలార్ మూవీలోని స్నేహానికి సంబంధించిన “సూరీడే గొడుగు పట్టి” అనే పాట అందరి మనసులను దోచుకుంటోంది. ఈ క్రమంలోనే.. సీఎం రేవంత్ రెడ్డి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆ పాటకు సంబంధించిన కొన్ని లిరిక్స్‌తో పాటు రాహుల్‌గాంధీతో పాటు తాను ఉన్న వీడియోను కూడా పోస్ట్ చేశారు. అది బీభత్సమైన వైరల్ గా మారింది. .. ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి కూడా ఆ పాటకు సంబంధించిన లిరిక్స్‌ను ట్వీట్ చేయటం గమనార్హం. ఆ లిరిక్స్‌కు తగ్గట్టుగా.. ఆయనతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఫొటోలను కలిపి.. ఎడిటింగ్ చేసిన వీడియోను కూడా షేర్ చేశారు కోమటిరెడ్డి.సినిమా అంటే ..సినిమా అంతే. సినిమా ప్రభావానికి గురికాని మనుషులు ఉంటారా ?
వేగమొకడు… త్యాగమొకడు
గతము మరువని గమనమే.ఒకరినొకరు నమ్మి నడిచిన బంధమే ఇదిలే
ఒకరు గర్జన… ఒకరు ఉప్పెన
వెరసి ప్రళయాలే.సైగ ఒకరు… సైన్యం ఒకరు
కలిసి కదిలితే కదనమే…#AdminPost #KomatiReddyVenkatReddy #RevanthReddy #TelanganaPrajaPrabhutwam @revanth_anumula @INCTelangana pic.twitter.com/BPNdM4LuRZ— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) December 31, 2023
గతంలో ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు
వేగమొకడు.. త్యాగమొకడు.. గతము మరువని గమనమే, ఒకరినొకరు నమ్మి నడిచిన బంధమే ఇదిలే, ఒకరు గర్జన.. ఒకరు ఉప్పెన.. వెరసి ప్రళయాలే, సైగ ఒకరు.. సైన్యం ఒకరు.. కలిసి కదిలితే కదనమే… అన్న లిరిక్స్‌ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్వీట్ చేశారు. కాగా.. కోమటిరెడ్డి చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గతంలో ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకున్న నేతలు.. ఇలా స్నేహానికి సంబంధించిన పాటను షేర్ చేయటంపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.
“కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దాం” మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ట్వీట్
అయితే.. నిన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సంబంధించిన ఫొటోను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి షేర్ చేశారు. “కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దాం”.. అంటూ భట్టి విక్రమార్కతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.
బొకేలకు, శాలువాలకు పెట్టే ఖర్చును సీఎం రీలీఫ్ ఫండ్ కు ఇవ్వండి
నూతన సంవత్సరం సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు రాష్ట్ర ప్రజలకు.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి.. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. తనను కలవడానికి వచ్చే నాయకులందరికి ఒక విన్నపం చేశారు. బొకేలకు, శాలువాలకు పెట్టే ఖర్చును సీఎం రీలీఫ్ ఫండ్ కు ఇస్తే నిరుపేదలకు ఉపయోగపడుతుందని వివరించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు లీడర్ల చుట్టూ తిరగాల్సిన పనిలేదని.. ప్రజాపాలన ద్వారా ఇతర కార్యక్రమాల ద్వారా తామే జనాల ముందుకు వచ్చి సమస్యల్ని తెలుసుకొని పరిష్కారిస్తామని తెలిపారు.
ALSO READ:Vishwak Sen: డ్రగ్స్ బ్యాక్ డ్రాప్ లో విశ్వక్ సేన్ ‘#కల్ట్’movie