Kollywood Actor Suriya : తమిళ చిత్ర పరిశ్రమలో ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాలలో ‘తంగలాన్’ ఒకటి. చియాన్ విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమాకు పా. రంజిత్ దర్శకత్వంల వహించారు. కొలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. విక్రమ్ తన కెరీర్లో ఎన్నడూ చేయని విధమైన పాత్రలో కనిపించనున్నారు.
ఈ చిత్రంలో మాళవిక మోహనన్ పార్వతి తిరువోతు హీరోయిన్స్ గా నటించగా.. కలైరాణి, రంజిత్ జయకోడి వంటి ప్రముఖ నటీ నటులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్,ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
#Thangalaan…!
THIS WIN WILL BE HUGE!! @chiyaan @beemji @parvatweets @MalavikaM_ @gvprakash @NehaGnanavel @GnanavelrajaKe @OfficialNeelam@StudioGreen2 @SakthiFilmFctry pic.twitter.com/nNij8gwqqb— Suriya Sivakumar (@Suriya_offl) August 14, 2024
ఈ నేపథ్యంలో విక్రమ్ టీంకు కోలీవుడ్ స్టార్ సూర్య బెస్ట్ విషెష్ తెలిపారు.’ఈ విజయం భారీ స్థాయిలో ఉండబోతుంది’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో సూర్య చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ట్వీట్ చూసిన సూర్య ఫ్యాన్స్ ‘తంగలాన్’ టీమ్ కు ‘ఆల్ ది బెస్ట్’ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.