Kollywood Star Ajith Joins KGF Universe : కన్నడ హీరో యష్ నటించిన ‘కేజీయఫ్’ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు, కథనం, సంగీతం తో పాటు, రాకీ పాత్రలో యశ్ నటనకు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ చిత్రం విజయంతో, ‘కేజీయఫ్’ యూనివర్స్ అనే ఒక కొత్త సినిమాటిక్ యూనివర్స్ పుట్టుకొచ్చింది.
ఇప్పుడు, ఈ యూనివర్స్‌లోకి తమిళ స్టార్ హీరో అజిత్ రాబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.అజిత్ ‘కేజీయఫ్ 3’ లో (KGF 3) ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారని అంటున్నారు. ఆయనకు ఈ యూనివర్స్‌లో కొత్త పాత్ర ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ప్రశాంత్‌నీల్‌తో (Prashanth Neel) అజిత్ ఏకంగా రెండు సినిమాలు చేయనున్నట్లు సమాచారం.
Also Read : ‘మా’ సంచలన నిర్ణయం.. మరో 18 యూట్యూబ్ ఛానల్స్ అవుట్..!
అందులో ఒకటి ‘కేజీయఫ్’ యూనివర్స్‌కు సంబంధించిన కథ అని.. మరొకటి విభిన్నమైన కథాంశం స్టాండలోన్ మూవీ అని తెలుస్తోంది. ఈ మేరకు చర్చలు కూడా జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినప్పటికీ, ఈ వార్తలతో ‘కేజీయఫ్’ అభిమానులు ఆనందంతో ఊగిపోతున్నారు.
అజిత్ రాక ‘కేజీయఫ్’ యూనివర్స్‌కు మరింత పాన్-ఇండియా గుర్తింపు తెస్తుందని నమ్ముతున్నారు. ఆయన నటనా ప్రతిభ, స్టార్ క్రేజ్ తో ఈ యూనివర్స్ మరింత ఎత్తుకు ఎదగడానికి అవకాశం ఉంది. ‘KGF 3’ లో అజిత్ ఎలాంటి పాత్రలో నటిస్తారో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
Also Read : విజయ్ దేవరకొండతో వివాదం.. మరోసారి స్పందించిన అనసూయ, ఈసారి ఏం చెప్పిందంటే?