Serial Actress Jyothi Rai Helps Singer Mogulaiah: సీరియల్ నటి జ్యోతి రాయ్ కి బుల్లితెర పై ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడ పరిశ్రమకు చెందిన ఈమె ‘గుప్పెడంత మనసు’ సీరియల్ తో తెలుగు ఆడియన్స్ కి ఎంతో చేరువైంది. ఓ వైపు సీరియల్స్ చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది.
కెరీర్ పరంగా బిజీ బిజీగా గడుపుతున్న జ్యోతి రాయ్ తాజాగా తన గొప్ప మనసు చాటుకుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న తోటి సినీ కళాకారుడికి సాయం చేసి తనలోని సేవా గుణాన్ని బయటపెట్టింది.
Also Read : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కి బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన హైకోర్టు!
‘భీమ్లా నాయక్’ సింగర్ కి సీరియల్ నటి ఆర్ధిక సాయం
పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) సినిమాలో టైటిల్ సాంగ్ పాడి ఓవర్ నైట్ ఫేమస్ అయిన కిన్నెర మొగులయ్య ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందులతో బాధ పడుతున్నారు. ఇటీవల కేసీఆర్ ప్రభుత్వం ఆయనకు కల్పించిన రూ.10 వేల పెన్షన్ ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడంతో పూట గడవడం కోసం కూలీ పనికి వెళ్తున్నాడు.
View this post on Instagram
మొగులయ్య ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతున్నాడని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్ది రోజుల క్రితం అతనికి సాయం చేయగా.. తాజాగా బుల్లితెర సీరియల్ నటి జ్యోతి రాయ్ సైతం మొగులయ్యను కలిసి రూ.50 వేల ఆర్థిక సాయం అందించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవ్వడంతో జ్యోతి రాయ్ మంచి మనసు పట్ల నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘మీరు చాలా గ్రేట్, మిమ్మల్ని చూసి మిగతా నటీ, నటులు నేర్చుకోవాలి’ అంటూ ఆమె ఫ్యాన్స్ ఈ సందర్భంగా కామెంట్స్ చేస్తున్నారు.