UK New PM : బ్రిటన్ (Britain) సార్వత్రిక ఎన్నికల్లో (General Elections) లేబర్ పార్టీ (Labour Party) భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేత కీర్ స్టార్మర్ (Keir Starmer) ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. ఫలితాలు వెలువడిన అనంతరం స్టార్మర్.. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కింగ్ ఛార్లెస్ – 3 ని మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన్ని ఆహ్వానించారు. అనంతరం కింగ్ ఛార్లెస్ -3.. స్టార్మర్ నియామకాన్ని ఆమోదించారు. ఈ భేటీకి సంబంధించి రాజ కుటంబం ఎక్స్‌లో షేర్ చేసింది.
Also read: బ్రిటన్ ఎన్నికల్లో గెలిచిన భారత సంతతికి చెందిన వారు వీరే!
రాజును కలిసిన తర్వాత కొత్త ప్రధాని స్టార్మర్ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశానికే మొదటి ప్రాధాన్యమని.. ఆ తర్వాతే పార్టీ అని అన్నారు. ప్రజా సేవ చేయడం ఒక గౌరవంగా అభివర్ణి్ంచారు. ఇదిలాఉండగా.. శుక్రవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో లేబర్ పార్టీ 412 సీట్లు దక్కించుకోగా.. కన్జర్వేటివ్ పార్టీ 121 స్థానాలకే పరిమితమైపోయింది. ఓటమిని అంగీకరించిన కన్జర్వేటీవ్ నేత రిషి సునాక్.. ప్రధాని అధికార నివాసం ముందు చివరగా ప్రసంగం చేశారు. ఆ తర్వాత రాజును కలిసి రాజీనామా లేఖను సమర్పించారు.
Also Read: లేబర్ పార్టీ భారీ విజయం.. స్పందించిన ప్రధాని మోదీ..