Perfect Strangers Movie : ఓ భాషలో హిట్ అయిన మూవీని మరో భాషలో రీమేక్ చేయడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. మన బాలీవుడ్, టాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఓ సినిమా మాత్రం ఒకటికాదు, రెండు కాదు ఏకంగా 26 సార్లు రీమేక్ అయి ‘గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ (Guinness World Record) లో చోటు సంపాదించుకుంది. ఇప్పుడు హిందీలో ‘ఖేల్ ఖేల్మే’ (Khel Khel Mein) పేరుతో హిందీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇంతకీ ఆ ఒరిజినల్ మూవీ పేరు మరేదో కాదు ‘పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్’. 2016లో విడుదలైన ఇటాలియన్ మూవీ ఇది. 2023 నాటికే 24 భాషల్లో దీన్ని రీమేక్ చేశారు. నథింగ్ టు హైడ్ (ఫ్రెంచ్), ఇంటిమేట్ స్ట్రేంజర్స్ (కొరియన్), కిల్ మొబైల్ (మాండరిన్) లౌడ్ కనెక్షన్ (రష్యన్), వైల్డ్ గేమ్ (ఐస్‌ల్యాండిక్) సహా వివిధ భాషల్లో రీమేక్ చేశారు. అరబిక్, రొమేనియన్, హిబ్రూ, జర్మన్ భాషల్లో ‘పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్’గానే పేరు పెట్టారు.
Also Read : అరుదైన వ్యాధితో బాధపడుతున్న ‘దేవర’ విలన్..!
కన్నడలో ‘లౌడ్ స్పీకర్’ అఫిషియల్ రీమేక్‌గా కాగా, మలయాళంలో ‘12th మ్యాన్’, తెలుగులో ‘రిచి గాడి పెళ్లి’ అనే సినిమా కూడా ఈ మూవీ ఆధారంగానే తీశారు. తాజాగా బాలీవుడ్లో ‘ఖేల్ ఖేల్ మేన్’ పేరుతో అక్షయ్ కుమార్ ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్, తాప్సి, అమ్మీ వ్రిక్, వాణీకపూర్, ఫర్దీన్‌ఖాన్, ఆదిత్య సీల్, ప్రజ్ఞా జైశ్వాల్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ముదస్సర్ అజీజ్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.