Katasani : టీడీపీ(TDP) నాయకులకు ఓటమి భయం పట్టుకుందని ధ్వజమెత్తారు కర్నూలు జిల్లా పాణ్యం వైసీపీ(YCP) ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి(Katasani Rambhupal Reddy). అందుకే తనపై తప్పుడు ఆరోపణ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నాడన్నారు. చంద్రబాబు నాయుడుకి మెదడు చెడిపోయిందని.. ఆయన మెంటల్ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇంకిత జ్ఞానం లేనోడు చంద్రబాబని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడుకు మతి బ్రమించిందని.. అందుకే ఇలా మాట్లాడుతున్నాడన్నారు. తన ఆస్తులపై చంద్రబాబు కబ్జాల రాంభూపాల్ రెడ్డి అంటూ చేసిన వ్యాఖ్యలను నిరూపిస్తే.. ఆ ఆస్తిని చంద్రబాబు(Chandrababu) మనవడు దేవాన్ష్(Devansh) కు రాసిస్తానని సవాల్ విసిరారు. ఆర్టీవీతో రాంభూపాల్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.