Karimnagar Silver Filigree artists in G20 summit: ఢిల్లీ వేదికగా ఈనెల 9,10వ తేదీల్లో జరగనున్న జీ20 సదస్సులో కరీంనగర్‌కు చెందిన కళాకారులకు అరుదైన గౌరవం లభించింది. ఈ జీ20 సమ్మిట్‌కు హాజరయ్యే ప్రపంచ దేశాల అధినేతలు, అతిథులు సిల్వర్ ఫిలిగ్రి అశోఖ చక్ర బ్యాడ్జీని ధరించనున్నారు. ఈ బ్యాడ్జీని కరీంగనర్‌కు చెందిన ఫిలిగ్రి కళాకారుడు ఎర్రోజు అశోక్ (Erroju Ashok) రూపొందించారు. దీంతో పాటు ఈ సమావేశాలు జరిగే చోట సిల్వర్ ఫిలిగ్రి స్టాల్‌కు కూడా కేంద్రం అనుమతి ఇవ్వడం విశేషం.
గతంలో హైదరాబాద్ కు ఇవాంకా ట్రంప్ (Ivanka Trump) వచ్చినప్పుడు సిల్వర్ ఫిలిగ్రి స్టాల్ ఏర్పాటు చేసుకునే అవకాశం దక్కింది. కానీ ఈ సారి ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న జీ20 సదస్సు(G20 summit)లో మన తెలుగు వారికి స్థానం దక్కడం గర్వకారణం. ఈ స్టాల్ లో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారుల చేతిలో తయారైన అద్భుత కళాఖండాలు ప్రదర్శించనున్నారు. దీంతో ఆయా దేశాల్లో మన కళాకారులకు గుర్తింపు లభించనుంది.
ఇక ఈ సమ్మిట్‌కు వచ్చే అతిథులకు మర్చిపోలేని ఆతిథ్యం ఇవ్వనున్నారు. భారతీయ వంటకాలను రుచి చూపించనున్నారు. అది కూడా వెండి పాత్రల్లో భోజనం వడ్డించనున్నారు. అతిథుల కోసం ఏర్పాలు వెండి పాత్రలపై కళాకారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. భారతీయత సంప్రదాయం కనిపించేలా ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ పాత్రల తయారీలో సుమారు 200 మంది కళాకారులు పాల్గొన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు ఈ పాత్రల తయారీలో పనిచేశారు. ఈ వెండి పాత్రలను జైపూర్ కంపెనీ IRIS తయారు చేసింది.
Also Read: మోదీ బిజీబిజీ.. మూడు రోజుల్లో 15 మంది ప్రపంచ నాయుకులతో ప్రధాని భేటీ!
అంతేకుండా అతిథుల కోసం ఏర్పాటుచేసిన ఉప్పు ట్రేలో అశోక చక్ర చిత్రం ఉండడం విశేషం. డిన్నర్ సెట్లో వెండి వస్తువులు, బంగారు పూత పూసిన గిన్నెలు, సాల్ట్ స్టాండ్, స్పూన్ ఉన్నాయి. మొత్తానికి వెండిపాత్రల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు కనిపించేలా రూపొందిచారు.
Also Read:ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడిన ధోనీ.. వైరల్ వీడియో..!