Kandula Durgesh
JSP-TDP: నిడదవోలులో టీడీపీ వర్సెస్ జనసేన రాజకీయం..!
Kandula Durgesh Vs TDP Burugupalli Sesha Rao: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో టీడీపీ జనసేన రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. పొత్తులో భాగంగా నిడదవోలు టికెట్ ను జనసేన కందుల దుర్గేష్ కు కేటాయించిన సంగతి తెలిసిందే. జనసేనకు సీటు కేటాయించడంతో నిడదవోలు టీడీపీ ఇంచార్జి బూరుగుపల్లి శేషారావు వర్గం అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిన్న నిడదవోలులో కందుల దుర్గేష్ భారీ ర్యాలీతో ఎంట్రీ ఇచ్చారు. అయితే, కందుల రాకను నిడదవోలు టీడీపీ కేడర్ వ్యతిరేకించారు. దుర్గేష్ ర్యాలీకి ఏ మాత్రం సహకరించలేదు. దీంతో సొంత వర్గంతోనే కందుల ర్యాలీ చేశారు.
Also Read: ముందు మీది మీరు చూసుకోండి.. విదేశీయులకు ఇచ్చిపడేసిన ఇండియా!
అనంతరం టీడీపీ ఇంచార్జి బూరుగుపల్లి శేషారావు ఇంటికెళ్లారు కందుల దుర్గేష్. కానీ, శేషారావు ఇంట్లో లేరని చెప్పడంతో కందుల నిరాశగా వెనుతిరిగారు. నిడదవోలు టికెట్ పై శేషారావు ముందు నుంచి ధీమాగా ఉన్నారు. ఆఖరి నిమిషంలో నిడదవోలు టికెట్ జనసేనకు మార్చడంతో ఆయన సహించలేనట్లుగా తెలుస్తోంది. టికెట్ రాకపోవడంతో శేషారావు అయోమయంలో పడ్డారు. సీటు ప్రకటించిన తరువాత కూడా అధిష్టానం నుంచి పిలుపు రాలేదని అలకబూనారని వార్తలు వినిపిస్తున్నాయి.
రానున్న ఎన్నికల్లో కలిసి పోరాడాల్సింది ఉండగా.. నిడదవోలులో మాత్రం టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా ఉంది. తాజాగా జరుగుతున్న రాజకీయాలపై నియోజకవర్గంలో తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది. అధిష్టానం శేషారావు కు నచ్చజెప్పి ముందుకు నడిపిస్తుందా లేదంటే చూసిచూడనట్లుగా ఉంటుందా అనేది తెలియాలి..ఒకవేళ హైకమాండ్ ఏ మాత్రం స్పంధించలేదంటే శేషారావు పార్టీ మారినా ఆశ్చర్యపోనవసరం లేదు.
Janasena: నిడదవోలు నుంచి కందుల దుర్గేష్..ప్రకటించిన పవన్ కల్యాణ్!
Nidadavole MP Ticket to Kandula Durgesh : ఏపీలో పొత్తు రాజకీయాలు రోజురోజుకి బలపడుతున్నాయి. అలాగే టీడీపీ-జనసేన (TDP- Janasena) మధ్య టికెట్ల వార్ కు కూడా నెమ్మదిగా తెరపడుతున్నట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా కందుల దుర్గేష్‌ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. దీనికి సంబంధించి పార్టీ నుంచి అధికారిక ప్రకటన విడుదల అయ్యింది.
కందులు దుర్గేష్ (Kandula Durgesh) ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. పొత్తులో భాగంగా దుర్గేష్ రాజమండ్రి (Rajahmundry) రూరల్ నుంచి పోటీ చేసేందుకు మొగ్గు చూపారు. అయితే అక్కడ నుంచి బుచ్చయ్య చౌదరి ఉండడంతో పాటు బీజేపీతో పొత్తు కుదరడంతో నిడదవోలు నియోజకవర్గం నుంచి దుర్గేష్ పోటీ చేసేందుకు రెడీ అయ్యారు.
నిడదవోలు అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా శ్రీ కందుల దుర్గేష్ pic.twitter.com/3lCWEYYYxH
— JanaSena Party (@JanaSenaParty) March 11, 2024
చాలా కాలం నుంచి దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని వినిపిస్తుంది. జనసేన (Janasena) 24 అసెంబ్లీ సీట్లకు పోటీ చేస్తున్న క్రమంలో తొలివిడతగా ఐదుగురు అభ్యర్థులను జనసేన ప్రకటించింది. కందుల దుర్గేష్ తో ఇప్పుడు మరో అభ్యర్థిని ప్రకటించారు జనసేన అధినేత.
ఇటీవల పొత్తులో జనసేన – టీడీపీ కలిసి ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 99 ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించగా.. అందులో టీడీపీ 94 మంది, జనసేన 5 మందిని ప్రకటించింది. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు (Chandrababu).. తాజాగా బీజేపీతో పొత్తు కుదరడంతో పవన్ కు షాక్ ఇచ్చారు.
3 ఎంపీ స్థానాలను రెండు స్థానాలకు పరిమితం చేసినట్లు తెలుస్తోంది. అయితే.. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాకూండా ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కాకినాడ నుంచి పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీని పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read: ఆస్కార్ వేదిక మీదకు బట్టలు లేకుండా వచ్చిన స్టార్ రెజ్లర్!
Kandula Durgesh: సూర్యప్రకాశ్ కు కందుల దుర్గేష్ వార్నింగ్.. జనసేన గురించి తప్పుగా మాట్లాడితే…
Janasena Kandula Durgesh: జనసేన పీఏసీ సభ్యుడిగా ఉన్న సీనియర్ కాపు నేత హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాశ్ (Chegondi Suryaprakash) వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ 24 సీట్లు తీసుకోవటం పై సూర్య ప్రకాశ్ ఆగ్రహం వ్యక్తి చేస్తూ పార్టీ మారారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వైఖరికి నిరసనగా సూర్య ప్రకాష్ పార్టీ మారుతున్నట్లు తెలిపారు.
కాగా, హరిరామ జోగయ్య లేఖ, కొడుకు వైసీపీలో చేరికపై జనసేన పీఏసీ సభ్యులు కందుల దుర్గేష్ స్పందించారు. ఇప్పటివరకు హరిరామ జోగయ్య (Harirama Jogaiah) తనయుడు తమకు సహచరుడిగా ఇప్పుడు తెర తీశారన్నారు. పార్టీలో ఉన్నంతకాలం బాగుందని చెప్పి ఇప్పుడు బాగోలేదని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జనసేనలో ఉన్నప్పుడు వైసీపీ గురించి ఏం మాట్లాడారో మీకే తెలుసని అన్నారు. పార్టీ నుండి బయటికి వచ్చిన తర్వాత పార్టీ అంతర్గత విషయాలు.. పార్టీని దూషించే విధంగా మాట్లాడకూడదని ఎందుకు ఆలోచన చేయడం లేదని నిలదీశారు.
Also Read: వైసీపీలోకి భూమా ఫ్యామిలీ.. భూమా అఖిలప్రియ Vs కిషోర్‌రెడ్డి
జనసేన పార్టీలో (Janasena Party) సంపూర్ణమైన స్వేచ్ఛ ఉందన్నారు. వైసీపీలో చేరగానే జనసేనకు ప్రజాస్వామ్యం లేదని అని మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. ఎన్నికల సమయంలో ఇటువంటి మాటలు మాట్లాడటం సమంజసం కాదని హెచ్చరించారు. గతంలో జనసేన అభివృద్ధి అని చెప్పిన హరి రామ జోగయ్య ఇప్పుడు మాట మార్చడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. విద్యులైన హరిరామ జోగయ్య ఆలోచించి ముందుకు వెళ్ళండన్నారు.
వైసీపీ ఆడే మైండ్ గేమ్ ట్రాప్ లో మీరు పడిపోతున్నారని కామెంట్స్ చేశారు. వైసీపీలో ప్రజాస్వామ్యం లేదు నియంతృత్వం మాత్రమే ఉందన్నారు. స్వయంగా ఈ మాట వైసీపీ ఎమ్మెల్యేలు నాయకులే చెప్తున్నారన్నారు. పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు నాయకులకే సీఎం అపాయింట్మెంట్ దొరకడం లేదని వ్యాఖ్యానించారు. హరి రామ జోగయ్య వ్యాఖ్యలను విజ్ఞులుగానే స్వీకరిస్తామన్నారు. అయితే, తనయుడు సూర్య ప్రకాష్ వ్యాఖ్యలు కరెక్ట్ కాదని తెలిపారు.