Kantara Chapter 1: 2022 ఇంకా కోవిడ్ భయం పూర్తిగా తీరలేదు. అప్పుడప్పుడే జనాలు థియేటర్లకు వెళ్ళి జనాలు సినిమాలు చూడ్డం మొదలెట్టారు. అప్పుడు వచ్చింది ఒక పెద్ద సునామి. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి నుంచి స్ప్రెడ్ అయ్యి పాన్ ఇండియా వరకు చేరింది. సెన్సేషన్ క్రియేట్ చేసింది. రీజనల్ సినిమాగా వచ్చి చరిత్ర సృష్టించింది. ది బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన కాంతర మూవీ. దాని తరువాత ఆ మూవీకి ప్రీక్వెల్ ఉంటుందని దర్శకుడు, ఆమూవీ హీరో రిషభ్ శెట్టి (Rishab Shetty) అప్పుడే అనౌన్స్ చేశారు. ఇప్పుడు దీని ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్.
Also Read:శివాజీని టార్గెట్ చేసిన హౌస్మేట్స్..
ఒంటి మీద కారుతున్న రక్తం…అగ్ని గోళాల్లా మండుతున్న కళ్ళు…శివునికి మరో రూపంలా కనిపిస్తున్న హీరో రిషబ్ శెట్టి అవతారంతో ఫస్ట్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. కాంతార క్లైమాక్స్ లో వరాహ అవతారంలో జస్ట్ శాంపిల్ చూపించిన రిషబ్ శెట్టి… ఈసారి కాంతార పార్ట్ 1తో సాక్షాత్ పరమ శివుడినే చూపించబోతున్నట్లు ఉన్నాడు. కాంతారలో (Kantara) చూసిన కథ కన్నా ముందు ఏం జరిగింది? అసలు వరాహ అవతారం కథ ఎక్కడి నుంచి మొదలయ్యింది అనేది కాంతర ఛాప్టర్ 1లో చూపించబోతున్నాడు దర్శకుడు రిషబ్ శెట్టి.
టీజర్ లో ఇంకో మెయిన్ హైలైట్ అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. కాంతర సినిమాకి ప్రాణం పోసిన అజనీష్ మరోసారి తన మ్యాజిక్ ని చూపించాడు. “ఓ” అనే అరుపు టీజర్ లో ప్లే అవ్వడంతో పాటూ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఏడు భాషలకి కలిపి ఒకటే టీజర్ ని రిలీజ్ చేసిన రిషబ్ శెట్టి కాంతర రేంజ్ ని అమాంతం పెంచేసాడు. ఇంతుకు ముందు కాంతారని రీజనల్ మూవీగా రిలీజ్ చేశారు. కానీ ఈసారి మాత్రం ఛాప్టర్ 1 ని పాన్ ఇండియా మూవీగానే విలీజ్ చేస్తున్నారు. మొదటి సినిమాతో పూనకాలు తెతప్పించిన కాంతార ఛాప్టర్ 1తో ఇంకేం చేస్తుందో చూడాలి.
Step into the land of the divine 🔥
Presenting #KantaraChapter1 First Look & #Kantara1Teaser in 7 languages❤️🔥
▶️ https://t.co/GFZnkCg4BZ#Kantara1FirstLook #Kantara @shetty_rishab @VKiragandur @hombalefilms @HombaleGroup @AJANEESHB @Banglan16034849 @KantaraFilm pic.twitter.com/2GmVyrdLFK
— Hombale Films (@hombalefilms) November 27, 2023