Thalaivar 171: సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth), యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (lokesh kanagaraj) కాంబోలో రాబోతున్న ‘#Thalaivar 171’ నుంచి మరో బిగ్ అప్ డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఈ మూవీలో పలువురు బాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రలు పోషించబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతుండగా తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో సైతం ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది.
I like Rajni Sir’s negative shade performances. I will try to bring it as much as I can in #Thalaivar171 💥
– Lokesh Kanagaraj pic.twitter.com/5xtDSAqwtI
— Bharathi (@Bharathistweets) October 31, 2023
బంగారం అక్రమ రవాణా నేపథ్యంతో..
ఈ మేరకు బంగారం అక్రమ రవాణా నేపథ్యంతో తెరకెక్కించబోయే సినిమాలో పలు పాత్రల కోసం రణ్ వీర్ సింగ్, షారుఖ్ ఖాన్‌లను సంప్రదించగా రణ్ వీర్ గ్రీన్ సిగ్నలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే షారుక్ ఇంకా క్లారిటీ ఇవ్వకపోగా ఇప్పుడు తెలుగు హీరో కింగ్ నాగార్జునను సైతం ఇందులో భాగం చేసేందుకు కనగరాజ్ ప్లాన్ చేస్తున్నాడట. ఇటీవలే నాగార్జునను కలిసి కథ కూడా వినిపించారని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.
ఇది కూడా చదవండి: Smokey Biscuits: బాలుడి ప్రాణం తీసిన స్మోక్ బిస్కెట్!
డైరెక్టర్ క్లారిటీ..
ఇదిలావుంటే.. సినిమాలో తలైవాను నెగెటివ్ షేడ్స్‌ను చూపించబోతున్నానని ఇప్పటికే డైరెక్టర్ క్లారిటీ ఇచ్చేశాడు. రజనీకాంత్‌లోని విలనిజం అంటే తనకు చాలా ఇష్టమని, రోబో తర్వాత రజనీ విలనిజాన్ని ఎలివేట్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. రజినీ పాత్రకు చాలా షేడ్స్ ఉన్నాయి. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు రజనీలోని మరో కొత్త కోణాన్ని పూర్తిగా ఆవిష్కరించబోతున్నాట్లు తెలిపారు.