Director Nag Ashwin About Kalki Sequel : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మైథలాజికల్ ఫిక్షనల్ మూవీ ‘కల్కి 2898AD’ ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు పార్ట్-2 ఉంటుందని కల్కి క్లైమాక్స్ లోనే హింట్ ఇచ్చారు. దీంతో అప్పుడే పార్ట్-2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి పార్ట్-2 పై స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ మేరకు కల్కి కథ మొత్తం పార్ట్-2 లోనే ఉంటుందని ఒక్కసారిగా హైప్ పెంచేసాడు.
” సీక్వెల్‌కు సంబంధించి నెలరోజుల షూటింగ్ చేశాం. దానిలో 20 శాతం బెస్ట్‌గా వచ్చింది. ఇంకా ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. వాటిని కొత్తగా ప్రారంభించాలి. ఈ సీక్వెల్లో కమల్ హాసన్, ప్రభాస్, అమితాబ్ మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలుంటాయి. అశ్వత్థామ, కర్ణుడు, యాస్కిన్‌ల మధ్య శక్తిమంతమైన ధనుస్సు కీలకం కానుంది” అని అన్నాడు.
ఇక ఈ సినిమాకు వస్తోన్న ఆదరణపై నాగ్ అశ్విన్ సంతోషం వ్యక్తం చేశారు. ‘ప్రేక్షకులు దీన్ని ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. ఎంతోమంది ఆడియన్స్ ఒకసారి కంటే ఎక్కువసార్లు దీన్ని వీక్షిస్తున్నారు. సినిమా విజయం సాధించిందని చెప్పడానికి అదే సంకేతం’ అంటూ ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పాడు. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కల్కి’ కలెక్షన్లలో రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు రూ.700కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లు చిత్రబృందం తెలిపింది. దీంతో త్వరలోనే ఈసినిమ రూ. 1000 కోట్ల క్లబ్లో చేరడం ఖాయమని డార్లింగ్ ఫ్యాన్స్ అంటున్నారు.