Kalki 2898AD Run Time : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ‘కల్కి 2898AD’ మూవీ జూన్ 27 న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ యాక్ట్ చేసిన ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ కావడంతో కల్కి పై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.
ఇక రిలీజ్ కు మరో ఆరు రోజులే ఉండటంతో సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం.. ఈ సినిమా రన్ టైమ్ 180.56 నిముషాలు అని సమాచారం. అంటే సరిగ్గా మూడు గంటలన్న మాట. మూడు గంటల పాటు ప్రేక్షకులను థియేటర్లో కూర్చోబెట్టడం అంటే మామూలు విషయం కాదు.
Also Read : ‘ఫియర్ సాంగ్’ లిరికల్ వీడియో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్..!
ఇటీవల కాలంలో మూడు గంటలకు అటు, ఇటుగా పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడమే కాదు, మంచి విజయాలను అందుకున్నాయి. పైగా ‘కల్కి’లాంటి సైన్స్ ఫిక్షన్ మూవీలకు ఇదంత కష్టమేమీ కాదు. ఈ విషయంలో చిత్ర బృందం పూర్తి నమ్మకంతో ఉంది. తాను అనుకున్న కథ ప్రకారం… దర్శకుడు నాగ్ అశ్విన్ మూవీని తీయగా, ఫుటేజ్ మొత్తం దాదాపు నాలుగున్నర గంటలు వచ్చిందని సమాచారం. ప్రేక్షకులు చూసేందుకు వీలుగా కథ, కథనాలు దెబ్బతినకుండా సినిమా రన్‌టైమ్‌ను మూడు గంటలకు కుదించినట్లు తెలుస్తోంది.