Prabhas Kalki Full Movie Leaked In Online : ఓ వైపు సూపర్ హిట్ టాక్ తో రికార్డులను బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తున్న కల్కి మూవీకి బిగ్ షాక్ తగిలింది. ఈ మూవీ పైరసీకి గురైంది. సినిమా ఫుల్ కాపీ ఆన్లైన్లో దర్శనం ఇవ్వడంతో నిర్మాతలు, ప్రభాస్ ఫ్యాన్స్ షాక్ కు గురవుతున్నారు. 600 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా పైరసీకి గురవడంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ఈ ప్రభావం సినిమా కలెక్షన్లపై పడే అవకాశం ఉందన్న ఆందోళన వారిలో వ్యక్తం అవుతోంది. MovieRulz తో పాటు పలు వెబ్ సైట్లలో కల్కి మూవీ కనిపిస్తోంది. దీంతో ఇది కాస్త కల్కి నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది.
గతంలోనూ పలు అగ్ర హీరోల సినిమాలకు ఈ పైరసీ దెబ్బ తప్పలేదు. హీరోలు పైరసీని ఎంకరేజ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా కొందరు కావాలనే సినిమా రిలీజ్ అయిన గంటల వ్యవధిలో ఆన్ లైన్ లో లీక్ చేస్తున్నారు. కల్కి మూవీ ఆన్ లైన్ లో లీక్ అవ్వడం పట్ల అటు ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాను పైరసీ చేసి ఆన్ లైన్ లో లీక్ చేసిన వారిపై మేకర్స్ కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.
మరి ఈ విషయంలో కల్కి నిర్మాతలు సైబర్ క్రైం పోలీసులకు పిర్యాదు చేస్తారా? లేదా? అనేది చూడాలి. ఇక నేడు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయినఈ మూవీ అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా సినిమాలో విజువల్స్, సెకండాఫ్ లో ప్రభాస్ – అమితాబ్ మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్స్, ఇంటర్వెల్ పార్ట్, క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని సినిమా చూసిన ఆడియన్స్ అంటున్నారు.