Kalki AD 2898:తెలుగు ప్రేక్షకులతో పాటూ పాన్ ఇండియా సినీ ప్రేక్షకులు ఎంతో ఉత్సుకతగా ఎదురు చూస్తున్న సినిమా ప్రభాస్ కల్కి మూవీ. ఈ ఏడాది మే 9న కల్కి సినిమాను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. శరవేగంగా షూటింగ్ కూడా జరుపుకుంటోంది. ఇందులో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా లోకనాయకుడు కమల్ హసన్ విలన్ గా నటిస్తున్నారు. అంతేకాదు బిగ్ బీ అమితాబచ్చన్ కూడా కల్కి మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఇందులో దీపికా పడుకునే, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక మలయాళ హీరో దుల్క్ సల్మాన్ కూడా నటిస్తున్నారని వార్తలు వినిపించాయి. ఇప్పుడు మరో వార్త తెగ చక్కర్లు కొడుతోంది.
Also Read:చీమల్లో రక్తం కనిపించదు ఎందుకో తెలుసా?
విజయ్ దేవరకొండ కూడా…
తాజాగా కల్కి మూవీలో విజయ్ దేవరకొండ కూడా నటిస్తున్నారని వార్తలు జోరందుకున్నాయి. నాగ్ అశ్విన్ ప్రతీ సినిమాలో విజయ్ దేవరకొండ ఉంటడు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతోనే అసలు రౌడీ హీరోకు తెలుగు ఇండస్ట్రీలో పేరు వచ్చింది. ఆ తర్వాత పెళ్ళి చూసులు సినిమాతో హీరోగా ఎదిగాడు. తరువాత కూడా మహానటి సినిమాలో విజయ దేవరకొండ సపోర్టింగ్ రోల్ చేశాడు. ఇలా నాగ్ అశ్విన్ ప్రతీ ప్రాజెక్టులో విజయ్ ఉంటున్నాడు. ఇప్పుడు అదే ఆనవాయితీని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారని తెలుస్తోంది. విజయ్ ఉంటే సినిమా హిట్ అవుతుందనే సెంటిమెంట్ కూడా నాగ్ అశ్విన్ కు ఉన్నట్టు చెబుతున్నారు. కల్కి సక్సెస్‌కు కూడా హీరో బాగా కలిసి వస్తాడని అందుకే అతనికి ఒక ప్రత్యేకమైన రోల్ పెట్టినట్టు చెబుతున్నారు.
పెద్ద పెద్ద యాక్టర్లతో రూపొందుతున్న కల్కి సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా నటించడం వలన కచ్చితంగా సినిమా స్థాయి మరింత పెరుగుతుంది. ఇక ఖుషి సినిమా తర్వాత విజయ్ ఫ్యామిలీ స్టార్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఫ్యామిలీ స్టార్ మూవీ సమ్మర్లో విడుదల అవనుంది.