‘Kalki 2898 AD’ Shoot Completed : ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 A’D షూటింగ్ ఎట్టకేలకు పూర్తయింది. ఎప్పుడో పూర్తి కావాల్సిన షూట్ పలు అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఈ సినిమా కోసం భారీ గ్రాఫిక్స్, VFX వాడుతున్నారు. అందుకే బెస్ట్ అవుట్ ఫుట్ కోసం మూవీ రిలీజ్ ని సైతం పోస్ట్ పోన్ చేశారు. ‘కల్కి’ మూవీ రిలీజ్ ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడటం గమనార్హం.
ఎట్టకేలకు పూర్తయిన షూటింగ్
కాగా రీసెంట్ గా యూరప్ లో చివరి షెడ్యూల్ షూట్ చేసిన మూవీ టీమ్ తాజాగా షూటింగ్ లో భాగంగా పెండింగ్ లో ఉన్న కొన్ని సీన్స్ తో పాటూ ప్యాచ్ వర్క్ అంతా కంప్లీట్ చేసి గుమ్మడికాయ కొట్టారు. ఈ క్రమంలోనే సినిమా కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డ టీమ్ అందరికీ నిర్మాతలు స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చారు.
దర్శకుడు నాగ్ అశ్విన్ ఫొటోలతో డిజైన్ చేసిన ఓ ఫన్నీ మీమ్ టీషర్ట్, వెండి కృష్ణుడి బొమ్మ, గొలుసు, నిర్మాణ సంస్థ ప్రేమతో రాసిన ఓ లెటర్, కల్కి బ్యాడ్జ్.. వీటన్నింటిని కల్కి చిత్ర బృందం మొత్తానికి ఇచ్చారు. వీటికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా కల్కి షూటింగ్ పూర్తయిన విషయం తెలిసి ఫ్యాన్స్ ముఖ్య టీమ్ ని ట్రైలర్ త్వరగా రిలీజ్ చేయాలని సోషల్ మీడియా వేదికగా రిక్వెస్టులు పెడుతున్నారు.
fri ,sat patch works tho #Kalki2898AD wrapped ✅✅ pic.twitter.com/xx2j3YyzQL
— 🦖 (@Salaarified22) May 26, 2024
Nagi 😂#Kalki2898AD #Prabhas pic.twitter.com/1trMhgBtS5
— . (@Praveenmudhir1) May 26, 2024