హనుమకొండ జిల్లా (Hanmukonda) పట్టణానికి చెందిన కాజల్ అనే యువతి అబ్బాస్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఏ కారణం లేకుండా ఆ యువతి హఠాత్తుగా చనిపోయింది. సాధారణ మరణగా భావించిన కుటుంబ సభ్యులు ఆమెను బొక్కలగడ్డ (Bokkalagaḍḍa )లో పూడ్చిపెట్టారు. అయితే దీనిపై కాజల్ కుటుంబానికి అబ్బాస్ అనే వ్యక్తిపై అనుమానం వచ్చింది. దీంతో అబ్బాస్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అబ్బాస్సే కాజల్‌ను చంపి ఉంటాడని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు..రీపోస్టుమార్టంకు అంగిక రించారు. ఎమ్మార్వో, డాక్టర్లు, పోలీసుల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ బోక్కలగడ్డ ఈద్గాలో కొనసాగనున్నది.
అయితే.. ప్రస్తుత కాలంలో యువతీ యువకులు ప్రేమలో పడటం చాలా సహజం. అయితే ఇలా ప్రేమించుకున్న వారిలో కొన్ని జంటలు మాత్రమే పెళ్లి పీటల వరకు వెళ్తాయి. మరికొంతమంది మాత్రం మధ్యలోనే వారి ప్రేమను సమాధి చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల బలవంతం మీద.. లేదా అమ్మాయిలు వారి భవిష్యత్తు గురించి బాగా స్థిరపడిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాటానికి వారు ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తారు. అయితే అమ్మాయిలు ఇలా చేయడంతో కొంతమంది అబ్బాయిలు తాము మోసపోయామని బాధపడితే.. మరి కొంతమంది మాత్రం అమ్మాయిల మీద కక్ష పెంచుకొని పగ తీర్చుకుంటూ ఉంటారు.
తాజాగా హనుమకొండ జిల్లాలో ఇటువంటి దారుణ సంఘటన ఒకటి జరిగింది. యువతి, యువకుడు చాలా మంది మ్యారేజ్, చేసుకుని హ్యాపీగానే జీవితాన్ని కొనసాగిస్తుంటారు. దంపతులకు పిల్లలు పుట్టిన తరువాత.. దంపతుల మధ్య తేడాలు వస్తుంటాయి. అలా మొదలైన గొడవలు.. వివాహేత బంధంపై మొగ్గుచూపుతారు. దీంతో కుటుంబంలో ఇంకా పెద్ద గొడవలై, హత్యయత్నాలు, కేసులు, ధర్నాలు, నిరసనలు ఇలా ఎన్నో సంఘటనలకు దారి తీస్తాయి. ఇలాంటి ఘటనే ఒకటి జరగటంతో.. చనిపోయిన కాజల్‌కి రీపోస్టుమార్టం చేస్తున్నారు అధికారులు. ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సింది.