Eluru – Kaikalru Highway : నిన్నటి వరకు విజయవాడ (Vijayawada) ను వణికించిన బుడమేరు…ఇప్పుడు కొల్లేరు (Kolleru) లంక గ్రామాలను వణికిస్తుంది. బుడమేరు నుంచి వరద నీరు భారీగా చేరడంతో కొల్లేరు ఉగ్రరూపం చూపిస్తుంది. దీంతో లంక గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. దీంతో లంక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో మండవల్లి, కైకలూరు, ఇంగిలిపాకలంక, కొవ్వాడలంక, నందిగామ లంక, నుచ్చుమిల్లి, పెనుమాకలంక, ఉనికిలి, తక్కెళ్లపాడు, మణుగునూరు గ్రామాలను కొల్లేరు చుట్టుముట్టింది.
దీంతో ఏలూరు-కైకలూరు మధ్య వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. మణుగునూరులో బోరుల్లో వరద నీరు చేరడంతో పైపుల నుంచి బురద నీరు వస్తున్నట్లు గ్రామాల ప్రజలు తెలియజేస్తున్నారు. కోమటిలంక సమీపంలో కొల్లేరు ఉద్ధృతంగా కైకలూరులోని కొత్తపేట కేడీసీసీ బ్యాంకు (KDCC Bank) నీట మునిగింది.
ఏలూరు-కైకలూరు ప్రధాన రహదారి పై చిన ఎడ్లగాడి సమీపంలో కొల్లేరు రెండున్నర అడుగుల ఎత్తులో కొల్లేరు వరద ప్రవహిస్తోంది. 2020లో కూడా ఇదే తరహా వరదలు (Floods) రావడంతో ఆ సమయంలో కూడా సుమారు 10 రోజుల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర రోడ్డు నీటితో మునిగిపోయింది. ఏలూరు నుంచి కైకలూరు మీదుగా వెళ్లే బస్సులు, వాహనాలను నరసాపురం, భీమవరం బస్సులను నారాయణపురం జాతీయ రహదారి మీదుగా మళ్లిస్తున్నారు. బైక్ ల రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపేశారు.
Also Read: ఏపీకి మరోసారి వానగండం.. భారీ వర్షాలు కురిసే అవకాశాలు!