Johnny Wactor: హాలీవుడ్ ప్రముఖ యాక్టర్ వాక్టర్ ను దారుణంగా కాల్చి చంపారు దుండగులు. అమెరికాలోని లాస్ఏంజెల్స్ లో కారులో వెళ్తుండగా అడ్డగించి దోపిడీకి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన వాక్టర్ పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వాక్టర్ చికిత్స పొందుతూ మరణించారు. ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వాక్టర్ కారులోని ఉత్ప్రేరక కన్వర్టర్‌ను దొంగిలించే క్రమంలో అడ్డుకోబోయిన వాక్టర్ పై కాల్పులు జరపడంతో చికిత్స పొందుతూ … మృతి చెందినట్లు వాక్టర్ తల్లి స్కార్లెట్ వెల్లడించారు.
జానీ వాక్టర్
జానీ వాక్టర్ 2007లో లైఫ్‌టైమ్ డ్రామా సిరీస్ ‘ఆర్మీ వైవ్స్’ అనే టీవీ షోతో కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ‘వెస్ట్‌వరల్డ్’, ‘ది ఓ’, ‘స్టేషన్ 19’, ‘క్రిమినల్ మైండ్స్’, ‘హాలీవుడ్ గర్ల్’ వంట వెబ్ సిరీస్‌లలో నటించారు. 2020లో ‘జనరల్ హాస్పిటల్’ అనే షోతో వాక్టర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ షోలో దాదాపు 200కు పైగా ఎపిసోడ్స్ లో నటించాడు.
Also Read: Mahesh Babu : ‘తండ్రిగా గర్వపడే రోజు ఇది’.. గౌతమ్ కోసం మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్..!