Johnny Wactor: హాలీవుడ్ యాక్టర్ ను దారుణంగా కాల్చి చంపిన దుండగులు ..!

హాలీవుడ్ ప్రముఖ యాక్టర్ వాక్టర్ ను దారుణంగా కాల్చి చంపారు దుండగులు. అమెరికాలోని లాస్ఏంజెల్స్ లో కారులో వెళ్తుండగా అడ్డగించి దోపిడీకి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన వాక్టర్ పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వాక్టర్ చికిత్స పొందుతూ మరణించారు.

New Update
Johnny Wactor: హాలీవుడ్ యాక్టర్ ను దారుణంగా కాల్చి చంపిన దుండగులు ..!

Johnny Wactor: హాలీవుడ్ ప్రముఖ యాక్టర్ వాక్టర్ ను దారుణంగా కాల్చి చంపారు దుండగులు. అమెరికాలోని లాస్ఏంజెల్స్ లో కారులో వెళ్తుండగా అడ్డగించి దోపిడీకి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన వాక్టర్ పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వాక్టర్ చికిత్స పొందుతూ మరణించారు. ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వాక్టర్ కారులోని ఉత్ప్రేరక కన్వర్టర్‌ను దొంగిలించే క్రమంలో అడ్డుకోబోయిన వాక్టర్ పై కాల్పులు జరపడంతో చికిత్స పొందుతూ ... మృతి చెందినట్లు వాక్టర్ తల్లి స్కార్లెట్ వెల్లడించారు.

జానీ వాక్టర్

జానీ వాక్టర్ 2007లో లైఫ్‌టైమ్ డ్రామా సిరీస్ ‘ఆర్మీ వైవ్స్’ అనే టీవీ షోతో కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ‘వెస్ట్‌వరల్డ్’, ‘ది ఓ’, ‘స్టేషన్ 19’, ‘క్రిమినల్ మైండ్స్’, ‘హాలీవుడ్ గర్ల్’ వంట వెబ్ సిరీస్‌లలో నటించారు. 2020లో 'జనరల్ హాస్పిటల్' అనే షోతో వాక్టర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ షోలో దాదాపు 200కు పైగా ఎపిసోడ్స్ లో నటించాడు.

Also Read: Mahesh Babu : ‘తండ్రిగా గర్వపడే రోజు ఇది’.. గౌతమ్ కోసం మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు