Actress Tamannah : బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం తన తాజా చిత్రం ‘వేదా’ ప్రమోషన్స్ సందర్భంగా విలేకరులతో ముఖాముఖీలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. జాన్ అబ్రహాం చేసిన చిత్రాల తరహాపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు.
తమన్నా సపోర్ట్
ఈ వివాదం నేపథ్యంలో జాన్ అబ్రహాంకు మద్దతుగా సహనటి తమన్నా ముందుకొచ్చారు. ‘వేదా’ చిత్రంలో తాను కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ, ‘వేదా’ చిత్రం కేవలం యాక్షన్ ఎంటర్టైనర్ కాదని, చాలా లోతుగా ఉన్న కథా చిత్రమని తెలిపారు. జాన్ అబ్రహాం ఈ రకమైన పాత్రలకు బాగా సూట్ అవుతారని, ఆయన నటనకు ప్రేక్షకులు మంచి రెస్పాన్స్ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read : ఓటీటీలోకి ‘భారతీయుడు 2’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!
” ట్రైలర్, ఇతర ప్రచార చిత్రాలు చూసి ‘వేదా’ని జడ్జ్ చేయకండి. యాక్షన్ ఫిల్మ్‌కు మించి ఇది ఉంటుంది. మన దేశంలోని గొప్ప యాక్షన్ హీరోల్లో జాన్ అబ్రహం ఒకరు. అతడు ఆ జానర్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంతో ఆయన ఈ సారి భిన్నమైన కథను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. ఈ సినిమా కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. యాక్షన్ చిత్రాలకు ఈ సినిమా కొత్త నిర్వచనాన్ని అందిస్తుందని నమ్ముతున్నా” అని తమన్నా అన్నారు.
సోషల్ మీడియాలో చర్చ
జాన్ అబ్రహాం, తమన్నా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. కొంతమంది జాన్ అబ్రహాంను సమర్థిస్తూ వస్తుండగా, మరికొందరు ఆయన వ్యాఖ్యలను విమర్శిస్తున్నారు. ఈ వివాదం తర్వాత ‘వేదా’ చిత్రంపై మరింత ఆసక్తి నెలకొంది. చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.