తెరాస రాజ్యసభసభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”ఆధ్వర్యంలో ప్రకృతి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తీసుకువచ్చిన “వృక్షవేదం” “హరితహాసం” పుస్తకాలను కైలాష్ సత్యార్ధికి అందించి సత్కరించారు. ఈ సందర్భంగా… కైలాష్ సత్యార్థి(Khailash Satyarthi) మాట్లాడుతూ పచ్చని ప్రపంచం కోసం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”(Green India Challenge) సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్(Joginipally Santhosh Kumar) నిర్విరామంగా కృషిచేస్తున్నారని కొనియాడారు.
రాజ్యసభసభ్యులు సంతోష్ కుమార్‌పై ప్రశంసలు
ఈ దేశంలో ఒక యువ పార్లమెంటేరియన్ ఈ విధంగా ప్రకృతి పరిక్షణ కోసం, భవిష్యత్ తరాల(next Generation) బాగుకోసం పనిచేయడం చాలా గొప్ప విషయం అని పేర్కొన్నారు. ఈ నేలను, సమాజాన్ని ప్రేమించే వ్యక్తులు నాయకులుగా మారితే ప్రపంచం సుఖసంతోషాలతో ఉంటుందని.. ఆ కోవలో ప్రథముడు జోగినిపల్లి అంటూ సంతోష్ కుమార్ పై ప్రశంసలు కురిపించారు. అనంతరం మాట్లాడిన జోగినిపల్లి సంతోష్ కుమార్ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 6.0”(Green India Challenge-6.0) ప్రారంభంలోనే కైలాష్ సత్యార్థి లాంటి గొప్ప వ్యక్తి పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషం కలిగిస్తుందని ఎంపీ సంతోష్ అన్నారు.
(Green Inida Challenge) గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌తో ప్రపంచాన్ని ఆకుపచ్చగా…
మొక్కలు నాటడం ద్వారా.. ప్రపంచాన్ని ఆకుపచ్చగా మార్చవచ్చని రాజ్యసభసభ్యులు సంతోష్‌కుమార్ ఆశావ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హక్కుల ఉద్యమకారులందరికి ఈ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” చేరువవుతుందని జోగినిపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఐఐటీ విద్యార్ధులతో పాటుగా డైరెక్టర్ ప్రొఫెసర్ పీజే నారాయణన్, (Prof. P.J. NArayanan) “గ్రీన్ ఇండియా చాలెంజ్” ఫౌండర్ మెంబర్స్ రాఘవ, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.