Janhvi Kapoor About Her Life Partner : బాలీవుడ్(Bollywood) బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) ప్రస్తుతం వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది. ఓ వైపు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూనే అదే సమయంలో సౌత్ మూవీస్ పై దృష్టి పెట్టింది. ‘దేవర’ సినిమాతో టాలీవుడ్(Tollywood) కి ఎంట్రీ ఇస్తున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే మిస్టర్ ‘అండ్ మిసెస్ మాహీ’ అనే హిందీ మూవీతో ఆడియన్స్ ముందుకు రానుంది.
ప్రెజెంట్ ఈ మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఈ సినిమా నుంచి తాజాగా ఓ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఎట్టకేలకు తనకు కాబోయే వాడి గురించి నోరు విప్పింది.
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా
తాజా ప్రెస్ మీట్ లో మీకు ఎలాంటి అబ్బాయి కావాలి? అని అడిగితే అందుకు జాన్వీ బదులిస్తూ..” నా డ్రీమ్స్ ని తన డ్రీమ్స్ గా భావించేవాడు. నాకు అండగా నిలిచేవాడు. ఎల్లప్పుడూ నాకు సంతోషాన్ని ఇచ్చేవాడు, నన్ను ఎప్పుడూ నవ్విస్తూ ఉండేవాడు, నేను ఏడ్చినప్పుడు నా పక్కనే ఉండి ధైర్యం చెప్పేవాడు. అలాంటి లక్షణాలున్న వ్యక్తి కావాలి” అంటూ తన మనసులో మాట బయటపెట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక జాన్వీ కపూర్ నటిస్తున్న దేవర(Devara) మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో జాన్వీ ‘తంగం’ అనే పాత్రలో కనిపించనుంది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది.