Anant-Radhika Pre Wedding: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ గ్రాండ్ ఈవెంట్ కు ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన అతిథులతో పాటు భారత క్రికెట్ స్టార్లు కూడా జామ్‌నగర్ చేరుకున్నారు. అతిథులతో జామ్ నగర్ లో సందడి నెలకొంది. మూడు రోజుల పాటు ఘనంగా జరగనున్న ఈ వేడుకల్లో ప్రముఖలు సందడి చేయనున్నారు.
ఇప్పటికే భారత క్రికెటర్లు వారి భార్యలతో కలిసి జామ్ నరగ్ లో ల్యాండ్ అయ్యారు. వీరిలో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, అతని భార్య సాక్షి, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, అతని కుటుంబం, హార్దిక్ పాండ్యా, అతని సోదరుడు కృనాల్ పాండ్యా, మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్, భార్య సాగరిక, సూర్యకుమార్ యాదవ్, భార్య దేవిషా శెట్టితోపాటు పలువురు ఇతర క్రికెటర్లు జామ్‌నగర్‌లో సందడి చేస్తున్నారు. కేవలం క్రికెటర్లు మాత్రమే కాకుండా ఇతర క్రీడాకారులు కూడా జామ్‌నగర్ చేరుకున్నారు.
View this post on Instagram
భారత క్రికెటర్లతో పాటు, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన రషీద్ ఖాన్, వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్‌తో సహా ఇతర విదేశీ ఆటగాళ్ళు, డ్వేన్ బ్రావో కూడా ప్రీ-వెడ్డింగ్ వేడుక కోసం జామ్‌నగర్ చేరుకున్నారు. ఈ సమయంలో ముంబై ఇండియన్స్ జట్టు ఆటగాళ్లు కూడా జామ్‌నగర్ చేరుకున్నారు. వీరిలో తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ వంటి స్టార్ బ్యాట్స్‌మెన్ కూడా ఉన్నారు. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా హాజరయ్యారు. ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ, అతని కుమారుడు ఆకాష్ అంబానీ 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇవాళ్టి నుంచి అనంత్, రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు మూడు రోజుల పాటు జరగనున్నాయి.
View this post on Instagram
శుక్రవారం సాయంత్రం 5.30గంటలకు ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ అయ్యాయి. మూడు రోజులు పాటు సంప్రదాయబద్ధంగా, అట్టహాసంగా ఈ వేడుకలు జరగనున్నాయి. అనంత్, రాధిక ఎంగేజ్ మెంట్ 2023 జనవరిలో ముంబైలోని అంబానీ నివాసం యాంటిలియాలో జరిగిన సంగతి తెలిసిందే. జులై వీరిద్దరూ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.