Jailer Trailer : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్(Super Star Rajinikanth), మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannah) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో రమ్యకృష్ణ, సునీలో, సంజయ్ దత్, జాకీష్రాప్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ కు మంచి క్రేజ్ వస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు.
ట్రైలర్ ను చూస్తుంటే ఫుల్ యాక్షన్, ఎంటర్ టైనర్ గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ (Jailer Trailer) ప్రారంభంలోనే తుపాకులు చప్పుళ్లు, బాంబు మోతలతో దద్దరిల్లింది. ఒక రేంజ్ తర్వాత మనదగ్గర మాటలుండవ్..కోతలే అనే డైలాగ్ మరింత ఆసక్తిని రేపుతోంది. ఈమధ్యే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు.
ఇక ఈ మూవీ భారీ అంచనాల నడుమ ఆగస్టు 10న రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. దీంతో ఈ మూవీకి అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా విడుదల చేశారు. ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి ఇప్పుడు మంచి రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్ లో 24 గంటల్లో మిక్స్డ్ రెస్పాన్స్ ఉందనే చెప్పాలి. తమిళంలో ఇతర బిగ్ రిలీజ్ లతో పోల్చితే కొంచెం తగ్గగా..తెలుగులో కూడా ఈ సినిమా మీర అద్భుతం కాదు కానీ పర్వాలేదని అనిపించే విధంగా రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తమిళ ట్రైలర్ ఓవరాల్ గా 24గంటల్లో 10.47 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. లైక్స్ పరంగా చూస్తే 637కే మార్క్ ను దాటింది.
ఇక తెలుగు వర్షన్ ట్రైలర్ 24 గంటల్లో 2.66మిలియన్ వ్యూస్ రాగా…లైక్స్ పరంగా చూస్తే 24గంటల్లో 125కే లైక్స్ మార్క్ ను అందుకుంది. మొత్తం మీద తెలుగులో పర్వాలేదు అనిపించేలా…తమిళంలో మాత్రం మంచి మార్కులే కొట్టేసింది. యూట్యూబ్ లో మూవీ ట్రైలర్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చినా…ట్రైలర్ ఆడియన్స్ లో సూపర్ సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. మొత్తానికి బ్యాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మూవీ ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాల్సిందే.
Also Read: ఆగస్ట్ నెల.. వారానికో మెగా మూవీ – భోళాశంకర్ , గాండీవధారి అర్జున , ఆదికేశవ