Jahnavi Died In Road Accident In Seattle, USA: గత ఏడాది అమెరికాలోని సియాటెల్‌లో జాహ్నవి అనే తెలుగు అమ్మాయిని పోలీస్ పెట్రోలింగ్ వాహనం గుద్దేసింది. దీంతో ఆమె అక్కడిక్కడే మరణించింది. ఆ తరువాత జాహ్నవి మృతి మీద మరొక పోలీస్ అధికారి చులకనగా మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఆమె ఓ సాధారణ వ్యక్తి.. ఈ మరణానికి విలువలేదు అన్నట్లుగా అతను మాట్లాడటం తీవ్ర దుమారం రేపింది. దీని మీద స్పందించిన భారత్.. ఆ అధికారి మీద వెంటనే చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేసింది. దీంతో అతనిని విధుల నుంచి సస్పెండ్ కూడా చేశారు. ఇప్పుడు ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆధారాల్లేవు…
కందుల జాహ్నవి రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఒక పెట్రోలింగ్ వాహనం ఆమెను ఢీకొట్టింది. అయితే దీనికి సంబంధించిన ఆధారాలు ఏమీ లేవని..ఎవరైతే జాహ్నవిని ఢీకొట్టారని చెబుతున్నారో..ఆ పోలీస్ అధికారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాషింగ్టన్ స్టేట్‌లోని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం ప్రకటించింది. సియాటెల్ పోలీస్ అధికారి కెవిన్ డేవ్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని చెబుతున్నారు. సీనియర్ అటార్నీలతో దీని గురించి చర్చించాకనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
Recent reports including in media of the handling of Ms Jaahnavi Kandula’s death in a road accident in Seattle in January are deeply troubling. We have taken up the matter strongly with local authorities in Seattle & Washington State as well as senior officials in Washington DC
— India in SF (@CGISFO) September 13, 2023
డేనియల్ అడెరెర్ కు డెవ్కు సంబంధం లేదు…
అయితే జాహ్నవి మృతి గురించి చులకనగా మాట్లాడిన అధికారి డేనియల్ అడెరెర్‌కు కెవిన్ కు సంబంధం లేదని అంటున్నారు. ప్రమాదం జరిగిన టైమ్‌లో అడెరెర్ అక్కడ లేరని చెబుతున్నారు. అడెరెర్ మీద క్రశిక్షణా చర్యలు తీసుకున్నామని…దాని ప్రభావం కెవిన్ డెవ్ మీద ఉండదని తెలిపారు. అడెరెర్ వ్యాఖ్యలు మాత్రం ఆమోద యోగ్యం కాదని అన్నారు. అలాంటి వ్యాఖ్యలు పోలీసులను తక్కువ చేస్తాయని…వారి మీద నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందని చెప్పారు. ఇప్పటికే అతనిని సస్పెండ్ చేశామని..అతని మీద ఫైనల్ యాక్షన్ విషయం మార్చి 4న కోర్టు ముందుకు రానుందని తెలిపారు.
ఇదేమన్యాయం..
మరోవైపు ఈ ప్రకటన మీద జాహ్నవి బంధువులు, స్నేహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతి వేగంగా పోలీస్ పెట్రోలింగ్ కారు నడపడం వల్లనే యాక్సిడెంట్ అయిందని..ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు కారు నడుపుతున్న కెవిన్ డేవ్ 100 మైళ్ళకు పైగా వేగంతో కారును నడిపారని చెబుతున్నారు. ఈ విషయం ప్రాథమిక విచారణలో కూడా తేలిందని…కానీ ఇప్పుడు సాక్ష్యాధారాలు లేవని చెప్పడం ఏంటని అడుగుతున్నారు.
Also Read:Telangana: రేపు సూళ్ళకు సెలవు..ఆ ఒక్క జిల్లాలో మాత్రమే