I Phone 16 Launch: ఇట్స్ గ్లో టైమ్ అంటూ యాపిల్ వచ్చేస్తోంది. తమ కొత్త ప్రోడక్టులను ఇందులో లాంఛ్ చేయడానికి రెడీ అయిపోయింది కంపెనీ సెప్టెంబర్ 9 దీన్ని అట్టహాసంగా జరపనుంది. ఉదయం 10గంటలకు అమెరికా టైమ్ ప్రకారం ఇట్స్ గ్లో టైమ్‌ను నిర్వహించనుంది యాపిల్. భారతదేశంలో రాత్రి 10.30కు ఇది ప్రసారం అవుతుంది. యాపిల్ అధికారిక వెబ్ సైట్లో, యూట్యూబ్‌లో దీన్ని వీక్షించవచ్చును. ఇక ఈ ఏడాది యాపిల్ ఐఫోన్ 16ను లాంఛ్ చేయనుంది. ఈ సీరీస్ నుంచి ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ఫ్రో, ఇంకా ప్రో మాక్స్‌లను విడుదల చేస్తుంది. దాంతో పాటూ యాపిల్ అల్ట్రా వాచ్ కొత్త సీరీస్లు, ఐపాడ్స్‌ను కూడా రిలీజ్ చేయనుంది కంపెనీ.
ఐఫోన్ 16 మోడల్స్ అన్నీ ఐఓఎస్ 18 సాఫ్ట్‌వేర్‌తో రావడమే కాక అన్ని ఫోన్లూ యాక్షన్ బటన్ కలిగి ఉంటాయి. ఇక ఐఫోన్ 16..6.1, 16 ప్లస్.. 6.7, 16 ప్రో.6.3, ప్రోమ్యాక్స్.. 6.9 అగుళాలను కలిగి ఉంటాయి. బ్యాటరీ కెపాసిటీ విషయానికి వస్తే..: ఐఫోన్ 16 3561mAh, ఐఫోన్ 16 Plus: 4006mAh, 16 Pro: 3355mAh, 16 Pro Max: 4676mAh బ్యారీలతో వస్తున్నాయి. ఇక దీనికి కూడా యూఎస్బీ టైప్ సీ ఛార్జర్‌నే ఇవ్వనుందని తెలుస్తోంది.
డిస్ప్లే ఫీచర్లు:
ప్రో మరియు ప్రో మాక్స్ మోడల్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటాయి. ఐఫోన్ 16, 16 ప్లస్‌లు 2x ఆప్టికల్ జూమ్‌తో 12MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉండగా. ప్రో సిరీస్ 48MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో వస్తోంది. ఐఫోన్ 16 ప్రో మోడల్‌లు A18 ప్రో చిప్‌సెట్‌ను కలిగి ఉంటాయని చెబుతున్నారు. అయితే బేస్ వేరియంట్లు మాత్రం A17 చిప్సెట్తో రావచ్చు.
ధరలు…
ఇక ధరల విషయానికి వస్తే బేసిక్ ఐఫోన్ 16 ధర 799 డాలర్లు అంటే 67,100 ఇండియన్ రూపాయలుగా ఉండనుంది. అలాగే 16 ప్లస్ 899 డాలర్లు అంటే రూ.75,500..16 ప్రో 1,099 డాలర్లు అంటే రూ.92,300…16 ప్రో మ్యాక్స్ 1,199 అంటే రూ. 99, 517 గానూ ఉండనుంది.