iPhone 15 Launched: ఐఫోన్ అంటేనే ఒక క్రేజ్. ప్రతీ ఏడాది ఏదో ఒక కొత్త అప్డేట్ తో కొత్త సీరీస్ ను లాంఛ్ చేస్తూ ఉంటుంది ఆపిల్ (Apple) కంపెనీ. 2007 నుంచి ఇప్పటి వరకు 15 సీరీస్ లను రిలీజ్ చేసింది. ఈసారి అందరూ అనుకున్నట్టుగానే ఐఫోన్ 15 (iPhone 15) లో చాలా కొత్త మార్పులను చేసింది. ఇంతకు ముందు ప్రో మోడళ్ళకు మాత్రమే పరిమితం చేసిన కొన్ని ఫీచర్లను ఈసారి బేస్ మోడళ్ళకు కూడా తీసుకువచ్చింది.
టైప్ సీ ఛార్జర్(Type C Charger)…
ఐఫోన్ ఛార్జర్ వేరుగా ఉంటుంది ఎప్పుడూ. అండ్రాయిడ్ ఫోన్ల మాదిరిగా మిగతా ఛార్జర్లతో ఐఫోన్ ఛార్జ్ చేసుకోవడం కుదరదు. 2012 నుంచి ప్రత్యేక ఛార్జింగ్ బ్రిక్, కేబుల్ ను ఇచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని మార్చి యూఎస్బీ-సీ పోర్ట్ ను ఇచ్చింది. ఇక మీదట ఐఫోన్ లో ఛార్జింగ్ అయిపోతే వేరే వాళ్ళ కూడా అడిగి ఎంచక్కా ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చును. మిగతా అన్ని ఫోన్లు కూడా ఇదే ఛార్జర్ ను ఇస్తున్నాయి.
యాక్షన్ బటన్ (Action Button)…
ఇంతకు ఫోన్లలో వాల్యూమ్ బటన్ కు పైన వైబ్రేట్, మ్యూట్ బటన్ ఉండేది. ఇప్పుడు దాన్ని యాక్షన్ బటన్ తో రీప్లేస్ చేశారు. కెమెరా, ఫ్లాష్ లైట్, వాయిస్ మెమో, నోట్, ఫోకస్ మోడ్ మార్చడం లాంటివన్నీ ఈ యాక్షన్ బటన్ తోనే చేయొచ్చు. అలాగే వైబ్రైట్, మ్యూట్ ఆప్షన్స్ ను కూడా దీంతోనే ఆపరేట్ చేసుకోవచ్చును. అంతేకాదు ఫోన్ లో ఉన్న మరికొన్ని ఫంక్షన్లను కూడా యాక్షన్ బటన్ కు యాడ్ చేసుకోవచ్చును.
డైనమిక్ ఐలాండ్…
ఈ ఫీచర్ పాతదే అయినా అది కేవలం ప్రో మోడళ్ళల్లో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు బేస్ మోడళ్ళతో సహా అన్ని మోడళ్ళకూ ఇచ్చేసింది కంపెనీ. టెక్ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్న ఋ ఫీచర్ ను ఇక మీదట వచ్చే అన్ని ఫోన్లలో ఉంటుందని కూడా చెప్పింది. డైనమిక్ ఐలాండ్ అనేది ఫోన్ తెర మీద ఒక పిల్ ఆకారంలో ఉంటుంది. దీంట్లో కెమెరా, ఫేస్ ఐడీ లాంటి సెన్సర్లు ఉంటాయి. ఇప్పుడు ఈ పిల్ కు మరికొన్ని ఫంక్షన్లను కూడా జోడించింది. దానికి అనుగుణంగా సాఫ్ట్ వేర్ ను కూడా మార్చింది. దీంతో ఇప్పుడు డైనమిక్ ఐలాండ్ ఒక ఫీచర్ గా కూడా పని చేస్తుంది. ఇన్ కమింగ్ కాల్స్, నోటిఫికేషన్లు, మ్యూజిక్ ప్లేబ్యాక్ లాంటి ఫంక్షన్లను స్క్రీన్ మీద నుంచే ఆపరేట్ చేసుకోవచ్చును.
కెమెరా…
ఇప్పటివరకూ ఐఫోన్ ప్రో లోనే మంచి కెమెరాలు ఉన్నాయి. బేస్ మోడల్స్ కు 12mp కెమెరా ఇచ్చి ప్రో మోడల్స్ లో 48 mp కెమెరా ఉండుది. కానీ ఇప్పుడు బేస్ మోడల్స్ కు కూడా 48 కెమెరాను ఇచ్చింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాలు కూడా ఇదే కెమెరా ఉండడం విశేషం.
టైటానియం డిజైన్…
ఐఫోన్ 15లో ప్రో మోడల్స్ ను ప్రత్యేకంగా టైటానియం డిజైన్ తో తీసుకువచ్చారు. దీనివల్ల ఫోన్ పెద్దగా ఉన్నా కూడా బరువుగా అనిపించదు.
ప్రాసెసర్…
ఐఫోన్ 15, ప్లస్ మోడల్స్ లో ఏ16 బయోనిక్ ప్రాసెసర్ ను ఇస్తున్నారు. ఇంతకు ముందు ఇది కేవలం ప్రో మోడల్స్ కు మాత్రమే ఉండేది.అలాగే 15 ప్రో మోడల్స్ కు ఏ 17 ప్రాసెసర్ ను ఇస్తున్నారు. బేస్ మోడల్స్ లో ప్రాసెసర్ ను మార్చడం వల్ల ఇంతకు ముందు బేస్ ఫోన్లు పని చేసిన దానికంటే 15 బేస్ ఫోన్లు 7 రెట్లు ఫాస్ట్ గా పని చేస్తాయి. దీంతో పాటూ ఫ్రాస్టెడ్ గ్లాస్ బ్యాక్ పానెల్ ను కూడా ఈసారి అన్ని ఫోన్లకూ ఇస్తున్నారు. దీనివలన ఫింగర్ ప్రింట్స్ పడకుండా ఉండడమే కాకుండా లుక్ కూడా చాలా స్టైలిష్ గా ఉంటుంది.
భారత్ లో ఐఫోన్ 15 ధరలు…
ఐఫోన్ 15- 79.900రూ.
15 ప్లస్- 89,900రూ.
15 ప్రో- 1, 34, 900రూ.
15 ప్రో మ్యాక్స్- 1, 59,900రూ.
Also Read: మీ కళ్లు సరిగ్గా కనిపించడం లేదా? అయితే ఈ జ్యూసులు తాగాల్సిందే..!!