Scholarship: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్. ఆర్ధికంగా వెనబడిన విద్యార్థులకు బరోసాగా నిలిచేందుకు ఓ ఫౌండేషన్ భారీ స్కాలర్ షిప్ అందించనుంది. ఇటీవల కాలంలో భారత్ నుంచి అమెరికా, బ్రిటన్, యూరప్, కెనడా వంటి దేశాలకు భారీ సంఖ్యలో వెళ్తున్న విషయం తెలిసిందే. కాగా యూనివర్సిటీ లివింగ్ సర్వే బియాండ్ బెడ్స్ అండ్ బౌండరీస్ ఆధారంగా.. 2023 నుంచి విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 2025 నాటికి రెండు మిలియన్లకు చేరుకోబోతున్నట్లు అంచనా వేసింది. 2019లో దాదాపు ఒక మిలియన్ స్టూడెంట్స్ విదేశీ చదువుల కోసం వెళ్లినప్పటికీ లక్షల సంఖ్యలో విద్యార్థులు లోన్లు, అప్పులు తీసుకుంటూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. అందులో కొంతమంది ఎడ్యూకేషన్ ను మధ్యలోనే వదిలేసిన సందర్భాలున్నాయి.
ఇన్‌లెక్స్ శివదాసాని..
ఈ క్రమంలోనే ప్రతిభావంతులైన భారతీయ విద్యార్థులకోసం Inlex శివదాసాని ఫౌండేషన్ ‘ఇన్‌లెక్స్ శివదాసాని స్కాలర్షిప్’ (Inlex Shivdasani Foundation) పేరిగా విద్యార్థులు విదేశాల్లో చదువుకోడానికి బరోసా అందించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు అమెరికా, బ్రిటన్,యూరప్‌లోని అగ్రశ్రేణి సంస్థల్లో మాస్టర్స్, ఎంఫిల్ లేదా డాక్టోరల్ డిగ్రీని అభ్యసించడానికి భారతీయ విద్యార్థులకు Inlex శివదాసాని స్కాలర్షిప్ అందించనుంది. 1976 నుంచి ఈ ట్రెండ్ కొనసాగుతుండగా.. ఈ స్కాలర్షిప్ కోసం ఫిబ్రవరి 6నుంచి మార్చి 22.వరకూ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
రూ. 82 లక్షల 97 వేలు..
ఇక ఈ ఇన్‌లెక్స్ శివదాసాని స్కాలర్షిప్ కింద పలు అధ్యయనాల కోసం (Research) లక్ష US డాలర్లు (సుమారు రూ. 82 లక్షల 97 వేలు) పొందనున్నారు. ఈ స్కాలర్షిప్ జీవన వ్యయాలు, ఆరోగ్య సంరక్షణ, వన్-వే విమాన ప్రయాణాలను కూడా కవర్ చేస్తుంది. INLAX శివదాసాని.. ఇంపీరియల్ కాలేజ్, లండన్, రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ (RCA), లండన్, యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ (కేంబ్రిడ్జ్ ట్రస్ట్), సైన్సెస్ పో, పారిస్, కింగ్స్ కాలేజ్ లండన్ (PHD విద్యార్థులకు), హెర్టీతో ఉమ్మడి స్కాలర్షిప్ అందించనున్నాయి.
స్కాలర్షిప్ కోసం అర్హత :
– అభ్యర్థులు తప్పనిసరిగా 1994 జనవరి 1న తర్వాత జన్మించి ఉండాలి. ఇండియాలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా ఉండాలి.
– విదేశీ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీని పొందినట్లయితే గ్రాడ్యుయేషన్ తర్వాత కనీసం రెండు సంవత్సరాల పాటు భారతదేశంలోనే ఉండాలి.
– సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్, లా, ఫైన్ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్,సంబంధిత సబ్జెక్టుల అభ్యర్థులు గ్రాడ్యుయేషన్‌లో కనీసం 65%, CGPA 6.8/10 లేదా GPA 2.6/4 అకడమిక్ గ్రేడ్ కలిగివుండాలి.
– అభ్యర్థులు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు తప్పనిసరిగా అడ్మిషన్ పొంది ఉండాలి. అడ్మిషన్ ప్రూఫ్ లేకుండా స్కాలర్షిప్ దరఖాస్తులు పరిగణించబడవు.
– TOEFL లేదా IELTS వంటి ఏదైనా పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అర్హతకు సంబంధించి మరింత సమాచారం కోసం, ఇన్లాక్స్ శివదాసాని స్కాలర్షిప్ పోర్టల్ www.inlaksfoundation.org/scholarships ను సంప్రదించవచ్చు.
దరఖాస్తు కోసం కావాల్సినవి :
పాస్ పోర్ట్
రెజ్యూమ్/ సీవీ
ఫొటో
అడ్మిషన్/ ఆఫర్ లెటర్
ఫీజ్ స్టేట్ మెంట్
ఆడిషనల్ ఫండ్స్ ఫ్రూఫ్
డిగ్రీ సర్టిఫికేట్ అండ్ మార్క్ లిస్ట్
ఎంపిక ప్రక్రియ :
స్కాలర్షిప్ కోసం అభ్యర్థులను స్వతంత్ర INLAX సెలక్ట్ కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ కమిటీ దరఖాస్తుదారుల గత, ప్రస్తుత అర్హతలు, భవిష్యత్తు అవకాశాల ఆధారంగా అంచనా వేస్తుంది. అభ్యర్థులు ప్రధానంగా వారి పోర్ట్‌ఫోలియో ఆధారంగా ఆర్ట్స్ అండ్ డిజైన్ (ఫైన్ ఆర్ట్స్/పెర్ఫార్మింగ్ ఆర్ట్స్)లో స్కాలర్షిప్ కోసం ఎంపిక చేయబడతారు. ఎంపిక ప్రక్రియలో మూడు దశలున్నాయి.