నేటితో లోక్‌సభ ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఈరోజు సాయంత్రం 6.30 PM గంటలకు విడుదల కాబోయే ఎగ్జిట్ పోల్స్ కోసం దేశప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఇండియా కూటమి సమావేశమైంది. ఈ మేరకు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘ ఇండియా కూటమి పార్టీలు సమావేశమయ్యాయి. ముందస్తు ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా బీజేపీని, దాని వ్యవస్థను బహిర్గతం చేయాలని నిర్ణయించాయి. ఈ ఎగ్జిట్ పోల్స్‌కి సంబంధించి అనుకూల, ప్రతికూల అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత.. ఈరోజు సాయంత్రం టీవీ ఛానల్ డిబేట్లలో ఇండియా కూటమి పార్టీలు పాల్గొనాలని ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నారని’ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేశ్ యాదవ్ తదితరులు ఉన్నారు.
Also Read: కేజ్రీవాల్ పిటిషన్‌పై కోర్టు తీర్పు రిజర్వ్.!
INDIA parties met and decided to expose the bjp and its ecosystem on the prefixed exit polls.
After considering factors for and against participating in the exit polls, it has been decided by consensus that all the INDIA parties will participate in the exit poll debates on…— Pawan Khera 🇮🇳 (@Pawankhera) June 1, 2024