Kopparthi, Orvakal: దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు రూ.28,602 కోట్ల అంచనా పెట్టుబడితో 10 రాష్ట్రాల్లో 12 కొత్త పారిశ్రామిక నగరాల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎన్ఐసిడిపి) కింద రూ.28,602 కోట్ల అంచనా పెట్టుబడితో 12 కొత్త ప్రాజెక్టు ప్రతిపాదనలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 10 రాష్ట్రాల్లో స్మార్ట్ సిటీలు నిర్మించబడతాయని చెప్పారు. ఉత్తరాఖండ్‌లోని ఖుర్పియా, పంజాబ్‌లోని రాజ్‌పురా-పాటియాలా, మహారాష్ట్రలోని డిఘి, కేరళలోని పాలక్కాడ్, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా , ప్రయాగ్‌రాజ్.. బీహార్‌లోని గయా, తెలంగాణలోని జహీరాబాద్ ఆంధ్రపరదేశ్లో ఓర్వకల్, కొప్పర్తి , రాజస్థాన్‌లోని జోధ్‌పూర్-పాలిలను పిశ్రీమిక నగరాలుగా ఈర్చిదిద్దనున్నారు. ఈ పారిశ్రామిక నగరాలు ఆరు ప్రధాన కారిడార్లకు దగ్గరగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు భారతదేశం యొక్క ఉత్పాదక సామర్థ్యాలను, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడంలో తోడ్పడనున్నాయి.
ఏపీలో కొప్పర్తి..
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ కట్టుబడి ఉందని కేంద్రమంత్రి కింజరపు రామ్మోహన్నాయుడు చెప్పారు. ఓర్వకల్లు, కొప్పర్తికి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను కేంద్రం మంజూరు చేసినట్టు కేంద్రమంత్రి చెప్పారు. అదే సమయంలో హైదరాబాద్- బెంగళూరు.. విశాఖ- చెన్నై కారిడార్లను కేంద్రం అభివృద్ధి చేస్తుందని తెలిపారు. కొప్పర్తిలో పారిశ్రామిక హబ్ కింద 2596 ఎకరాలను కేంద్ర ప్రభుత్వం.. ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయనుంది. ఈ కొప్పర్తి.. విశాఖ-చెన్నై కారిడార్ కిందకు వస్తుంది. ఇక్కడ స్టార్ట్ సిటీ రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.2,137 కోట్లను ఖర్చు చేయనుంది. కొప్పర్తి పారిశ్రామిక హబ్‌తో 54,500 మందికి ఉపాధి లభించనుంది. కొప్పర్తిలో ఉత్పత్తి రంగంపై ఎక్కువగా దృష్టి పెడతామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
ఓర్వకల్…
ఇక కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 2,621 ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూ.2,786 కోట్లను కేంద్ర ప్రభుత్వం వెచ్చించనుంది. ఈ పారిశ్రామిక హబ్ ద్వారా దాదాపు 45 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.