Chiranjeevi Indra Movie : మెగాస్టార్ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘ఇంద్ర’ సినిమా 22 ఏళ్ళ తర్వాత రీ రిలీజ్ రూపంలో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఆగస్టు 22 న రీ రిలీజ్ అయింది. దీంతో థియేటర్లలో ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. వింటేజ్ మెగాస్టార్ ను స్క్రీన్స్ పై మరోసారి చూస్తూ థియేటర్లలో రచ్చ రచ్చ చేశారు.
ఈ క్రమంలోనే ‘ఇంద్ర’ (Indra) మూవీకి సంబంధించి నెట్టింట రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా ఇంద్ర మూవీ టైమ్ లో చిరు ఏజ్ గురించి మాట్లాడుకుంటున్నారు. నిజానికి ఇప్పటి తరం వాళ్ళు ఇంద్ర మూవీ టైమ్ లో మెగాస్టార్ చాలా సీనియర్ హీరో, ఆయనకి అప్పటికే ఏజ్ ఎక్కువ అని చెబుతుంటారు. కానీ అసలు నిజం ఏంటంటే, ఇంద్ర 2002 లో వచ్చింది.
Also Read : ‘ఈగ’ సీక్వెల్ తీస్తా.. కానీ నీతో కాదని రాజమౌళి అన్నారు : నాని
ఈ మూవీ టైం లో చిరంజీవి (Chiranjeevi) ఏజ్ 47 ఏళ్ళు మాత్రమే. అంటే ఇప్పటి తరం హీరోలైన ప్రభాస్ (Prabhas), మహేష్ బాబు (Mahesh Babu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఏజ్ తో సమానం అన్న మాట. చిరంజీవి ఇంద్ర సమయంలో ఈ హీరోలంతా ఇంకా ఫామ్ లోకే రాలేదు. అలాంటి టైం లోనే చిరుకి తెలుగు రాష్ట్రాల్లో నెక్స్ట్ లెవెల్ లో పాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఆయన వయసు 69. ఈ ఏజ్ లోనూ స్టార్ హీరోలతో పోటీ పడి మరీ అదే జోష్ తో సినిమాలు చేస్తున్నారు.