Road Accident At Night : ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారి(Indore-Ahmadabad National Highway) పై రాత్రి 11 గంటలకు ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ కారు రోడ్డు పక్కన ఉన్న డంపర్ ట్రక్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరోకరికీ తీవ్రంగా గాయాలయ్యాయి. కారు పూర్తిగా నుజ్జు నుజ్జు అయిపోయింది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. భాగ్‌తండా నుంచి గణకు వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఒకరు పోలిస్(Police) ఉన్నారని.. అతని ఐడీకార్డు లభించినట్లు తెలిపారు.
Also Read: పెంపుడు కుక్క పై పొరుగింటి వారి పైశాచికత్వం!
మరోవైపు ఒడిశా(Odisha) లో కియోంజర్ జిల్లాలో కూడా ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) సంభవించింది. రెండు ట్రక్కలు ఓ కారు మీదకి దూసుకెళ్లడంతో.. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. వీళ్లందరూ కూడా ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని.. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని చెప్పారు.
Also Read: లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్.. సీఎం కేజ్రీవాల్ కు ఊరట దక్కేనా?