Indian 2 First Single Promo : కోలీవుడ్ (Kollywood) మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటైన ‘ఇండియన్ 2’ (Indian 2) నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇటీవల ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేస్తూ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇవ్వగా.. కొద్ది సేపటి క్రితమే ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు. తమిళ్ తో పాటూ తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేసిన ఈ ప్రోమో అన్ని భాషల్లో ఆకట్టుకునే విధంగా ఉంది.
అంచనాలు పెంచిన ప్రోమో
‘శూరా’ (Souraa) అంటూ సాగిన ఈ బీట్‌కు అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు. ఈ ఫాస్ట్ బీట్‌లో కమల్ హాసన్ (Kamal Hassan) గుర్రంపై వెళ్తున్నట్లుగా చూపించారు. ఆయన మొహం సరిగ్గా కనిపించలేదు. కానీ ప్రొమో సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ముఖ్యంగా అనిరుద్ వాయిస్ తో సాగిన ఈ ప్రోమోలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పించింది. కాగా ఈ ప్రోమో కాస్త సినిమాపై అంచనాలు పెంచేసింది. ఫుల్ సాంగ్ ను మే 22 సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నారు.
Also Read : థియేటర్స్ లో ‘కన్నప్ప’ టీజర్.. కేవలం వాళ్లకు మాత్రమే!
ప్రస్తుతం ఈ ప్రోమో సాంగ్ సోషల్ మీడియా (Social Media) లో వైరల్ గా మారింది. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ – కమల్ హాసన్ కాంబో అప్పట్లో వచ్చిన ఇండియన్ మూవీకి ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ జూలై 12 న రిలీజ్ కానుంది.